Singer Mangli: నేను ఏ తప్పూ చేయలేదు.. ఏడుస్తూ మంగ్లీ!

Singer Mangli: తనపై వచ్చిన స్కామ్ ఆరోపణలపై సింగర్ మంగ్లీ స్పందించారు. తనకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని, అనవసరంగా తన పేరును వాడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Update: 2026-04-12 12:35 GMT

Singer Mangli: నేను ఏ తప్పూ చేయలేదు.. ఏడుస్తూ మంగ్లీ!

Singer Mangli: తమపై వచ్చిన స్కామ్ ఆరోపణలపై ప్రముఖ గాయని మంగ్లీ తీవ్రంగా స్పందించారు. ఈ విషయంలో తనకేమాత్రం సంబంధం లేదని, అనవసరంగా తన పేరును వాడుకుంటూ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 

ఈ స్కామ్‌లో తన ఇన్వాల్వ్మెంట్ 1% కూడా లేదని, అసలు అది 0% అని మంగ్లీ స్పష్టం చేశారు. కేవలం ఫేమస్ అవ్వడం కోసమే కొందరు వ్యక్తులు తన పేరును వాడుకుంటున్నారని ఆమె మండిపడ్డారు.

ఈ కేసులో పేర్కొంటున్న బాలాజీ నాయక్, మధు నాయక్ వంటి వ్యక్తులు ఎవరో తనకు తెలియదని, వారితో తనకు ఎలాంటి గొలుసుకట్టు సంబంధాలు లేవని చెప్పారు.

Full View


Tags:    

Similar News