Srikalahasti: ఫ్యాక్టరీ ఉద్యోగం ప్రాణం తీసింది.. రాచగున్నేరిలో తమిళ యువకుడి హత్య

Srikalahasti: శ్రీకాళహస్తి రూరల్ పరిధిలోని రాచగున్నేరిలో తమిళనాడుకు చెందిన యువకుడు సారథి హత్యకు గురయ్యాడు.

Update: 2026-05-12 05:51 GMT

Srikalahasti: ఫ్యాక్టరీ ఉద్యోగం ప్రాణం తీసింది.. రాచగున్నేరిలో తమిళ యువకుడి హత్య

Srikalahasti: శ్రీకాళహస్తి రూరల్ పి.ఎస్ పరిధిలోని రాచగున్నేరి గ్రామంలో హత్య ఘటన చోటుచేసుకుంది. 11-05-2026 సాయంత్రం సుమారు 7 గంటల సమయంలో అద్దె గదిలో ఈ సంఘటన జరిగింది. మృతుడు సారథి @ అప్పు (25), తమిళనాడు రాష్ట్రానికి చెందిన వ్యక్తి. నిందితుడు శ్రీధర్ (21), మదురై జిల్లా, తమిళనాడు రాష్ట్రానికి చెందినవాడు. ఇద్దరూ ఒకే గదిలో నివాసముంటూ లాంకో ఫ్యాక్టరీలో పని చేస్తున్నారు. ఉద్యోగ పదవి విషయంలో, అలాగే మద్యం మత్తులో జరిగిన మాటల తగాదా వివాదానికి దారితీసింది.

ఆగ్రహానికి లోనైన నిందితుడు విరిగిన బీర్ బాటిల్‌తో మృతుడిపై దాడి చేశాడు. తీవ్ర గాయాల కారణంగా మృతుడు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Tags:    

Similar News