Srikalahasti: అభయ ఆంజనేయుడికి చందన అలంకారం.. శ్రీకాళహస్తిలో భక్తుల కోలాహలం!

Srikalahasti: శ్రీకాళహస్తిలోని సంకట హర అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.

Update: 2026-05-12 05:43 GMT

Srikalahasti: అభయ ఆంజనేయుడికి చందన అలంకారం.. శ్రీకాళహస్తిలో భక్తుల కోలాహలం!

Srikalahasti: హనుమాన్ జయంతిని పురస్కరించుకుని శ్రీకాళహస్తిలోని దిగువ సన్నిధి వీధి నందు ఉన్న సంకట హర అభయ ఆంజనేయ స్వామి దేవాలయం నందు స్వామివారికి విశేష అభిషేకాలు నిర్వహించి, ధూప, దీప, నైవేద్యాలు సమర్పించి స్వామివారిని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు ఆంజనేయ స్వామి దర్శించుకుని పరవశితులయ్యారు. సాయంత్రము స్వామివారిని చందన అలంకరించి ధూప దీప నైవేద్యాలు సమర్పించి, భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు,అనంతరం రాత్రి స్వామివారికి గ్రామోత్సవం అత్యంత వేడుకగా ఆలయ కమిటీ సభ్యులు నిర్వహించగా, భక్తులు అడుగడుగునా స్వామి వారిని దర్శించుకుంటూ కర్పూర హారతులు నీరాజనాలు ఇస్తూ స్వామివారి కృపకు పాత్రులయ్యారు ఈ కార్యక్రమంలో భక్తులుమరియు ఆలయ కమిటీ సభ్యులు ఆలయ అర్చకులు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News