Srikalahasti: శ్రీకాళహస్తి నిత్యాన్నదానానికి భారీ విరాళం.. హైదరాబాద్ దంపతుల ఉదారత!
Srikalahasti: హైదరాబాద్‌కు చెందిన మదన్ మోహన్ రెడ్డి దంపతులు శ్రీకాళహస్తి నిత్యాన్నదాన పథకానికి రూ. 50,116/- విరాళంగా ఇచ్చారు.
Srikalahasti: శ్రీకాళహస్తి నిత్యాన్నదానానికి భారీ విరాళం.. హైదరాబాద్ దంపతుల ఉదారత!
Srikalahasti: హైదరాబాద్‌కు చెందిన శ్రీ మదన్ మోహన్ రెడ్డి దంపతులు దేవస్థానం నిర్వహిస్తున్న నిత్యాన్నదాన పథకానికి రూ.50,116/-లను విరాళంగా అందజేశారు. ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ విరాళాన్ని స్వీకరించారు. దాత దంపతులకు ఆలయ అధికారులు అంతరాలయ దర్శనం మరియు వేద ఆశీర్వచనం ఏర్పాటు చేశారు. నిత్యాన్నదాన పథకానికి భక్తులు అందిస్తున్న విరాళాలు అన్నదాన సేవలను మరింత విస్తరించేందుకు దోహదపడుతున్నాయని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.