CP Sajjanar: అందమైన అమ్మాయిల యాడ్స్ చూసి మోసపోకండి.. ‘హనీట్రాప్’పై సీపీ సజ్జనార్ సీరియస్ వార్నింగ్!
CP Sajjanar: యువత ఒంటరి తనాన్ని ఆసరాగా చేసుకుని నేరగాళ్లు పన్నుతున్న హనీట్రాప్‌పై అప్రమత్తంగా ఉండాలన్నారు హైదరాబాద్ సీపీ సజ్జనార్.
CP Sajjanar: అందమైన అమ్మాయిల యాడ్స్ చూసి మోసపోకండి.. ‘హనీట్రాప్’పై సీపీ సజ్జనార్ సీరియస్ వార్నింగ్!
CP Sajjanar: యువత ఒంటరి తనాన్ని ఆసరాగా చేసుకుని నేరగాళ్లు పన్నుతున్న హనీట్రాప్‌పై అప్రమత్తంగా ఉండాలన్నారు హైదరాబాద్ సీపీ సజ్జనార్. ఒంటరిగా ఉంటే ఈ యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి. అందమైన అమ్మాయిలు, ఆంటీలతో సరదాగా మాట్లాడండి, అంటూ సోషల్ మీడియాలో ఇబ్బడిముబ్బడిగా కనిపిస్తున్న ఈ యాడ్స్ వెనక నిలువునా దోచేసే సైబర్ కేటుగాళ్ల ఉచ్చుదాగుందన్నారు.
ఈ వీడియోల్లో ఆకర్షణీయంగా కనిపిస్తున్న అమ్మాయిలు నిజం కాదని...అవన్నీ ఏఐ సాయంతో సృష్టించిన వీడియోలని తెలిపారు. ఆ లింక్ ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకోగానే, మీ ఫోన్‌లోని కాంటాక్ట్స్, గ్యాలరీ మొత్తం వారి అధీనంలోకి వెళ్లిపోతాయని తెలిపారు. మీరు ఇలాంటి సైబర్ వలలో చిక్కుకుంటే, పరువు పోతుందేమో అని భయపడొద్దని...సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయండని...సీపీ సజ్జనార్ అప్రమత్తం చేశారు.