Medak: రాజ్యాంగంపై దాడిని తిప్పికొట్టాలి.. సిపిఎం నేత

Medak: మెదక్‌లో సిపిఎం ఆధ్వర్యంలో జరిగిన ‘రాజ్యాంగ పరిరక్షణ’ సెమినార్‌లో ఎం. అడివయ్య పాల్గొన్నారు.

Update: 2026-04-12 11:56 GMT

Medak: రాజ్యాంగంపై దాడిని తిప్పికొట్టాలి.. సిపిఎం నేత

Medak: సిపిఎం మెదక్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు కేవల్ కిషన్ భవన్లో సామాజిక ఉద్యమ సారధుల జయంతి ఉత్సవాల సందర్బంగా రాజ్యాంగం పరిరక్షణ - సవాళ్లు అనే అంశంపై సెమినార్. సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి కె నర్సమ్మ అధ్యక్షతన జరిగింది.

ఈ సెమినార్కు ముఖ్య అతిథిగా హాజరైన అయన మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశాన్ని అన్ని విధాలా అధోగతి పట్టించిన, సహజ వనరులతో సహా ప్రజా ధనాన్ని కార్పొరేట్లకు దోచిపెడుతూ ప్రజల్లో మత, కుల వైషమ్యాలను పెంచి పోసిస్తుందన్నారు. బీజేపీ పాలనలో ప్రమాదంలో పడ్డ దేశాన్ని రక్షించుకొనేందుకు ప్రజలు ముందుకు రావాలన్నారు.

ఫెడరల్‌ స్ఫూర్తికి మోడీ సర్కారు విఘాతం కలిగిస్తోందన్నారు. సోదర భావంతో మెలగాల్సిన ప్రజల్లో మతం చిచ్చుపెట్టి లౌకికతత్వానికి ముప్పు తెచ్చిపెట్టిందన్నారు. రాజ్యాంగానికి మూల స్తంభాలైన ప్రజాస్వామ్యం, సెక్యులరిజం, సామాజిక న్యాయం, ఆర్థిక స్వావలంబన, సమాఖ్య వ్యవస్థను మోదీ ప్రభుత్వం ధ్వంసం చేస్తోందన్నారు. భారత దేశ సమగ్రత, ప్రజాస్వామ్య భద్రత లౌకికవాదంతో ముడిపడి ఉంది రాజ్యాంగం మన దేశాన్ని లౌకిక రాజ్యంగా పేర్కొన్నదనీ తెలిపారు.

అయితే హిందూ- ముస్లింల మధ్య అగాధాన్ని సష్టించి మెజారిటీ హిందూ మత పార్టీగా ఉండాలని బిజెపి అనేక ప్రయత్నాలు చేస్తున్నదనీ తెలిపారు. దేశాన్ని మనుషులుగా చూసి, వారి సమస్యలను పరిష్కరించాల్సింది పోయి, వారిని కులాలుగా, మతాలుగా విడగొట్టి భావోద్వేగాలను రెచ్చగొట్టే కుతంత్రం బీజేపీలో దాగి ఉన్నదన్నారు. కుల మతాలకు అతీతంగా పౌరుడిని పౌరుడిగా గుర్తించాలన్న రాజ్యాంగం స్ఫూర్తికి విరుద్ధంగా పాలన సాగుతోందని తెలిపారు.

రాజ్యాంగం పై దాడి జరుగుతున్న తరుణంలో ప్రజలంతా రాజ్యాంగ పరిరక్షణకు ముందుకు రావాలని అన్నారు.రాజ్యాంగం స్థానంలో మణుధర్మ శాస్త్రన్ని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని అన్నారు.దేశ ప్రజల మధ్య మత వైశ్యమ్యాలు సృష్టించాలని బీజేపీ చూస్తుందని అన్నారు.మోడీ విధానాల వలన దేశంలో అసమానతలు పెరిగిపోతున్నాయని అన్నారు. పేదల సంపదను సంపన్నులకు కట్టబెట్టుతున్నారని అన్నారు.

ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కె మల్లేశం, జిల్లా కమిటీ సభ్యులు జె సంతోష్ కుమార్, సిపిఎం నాయకులు కె యశోద, కవిత, యాదగిరి, దుర్గ, స్వరూప, చంద్రం, కిష్టయ్య, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News