Huzurabad: పంట పొలాల మధ్య చెత్తా? హుజరాబాద్‌లో బీజేపీ భారీ నిరసన!
Huzurabad: హుజరాబాద్‌లో డంపింగ్ యార్డ్ ఏర్పాటుపై బిజెపి నేతల ఆగ్రహం. అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా చేపట్టి ఆర్డీఓకు వినతిపత్రం అందజేత.
Huzurabad: పంట పొలాల మధ్య చెత్తా? హుజరాబాద్‌లో బీజేపీ భారీ నిరసన!
కరీంనగర్: హుజురాబాద్ పట్టణం అంబేద్కర్ చౌరస్తాలో డంపింగ్ యార్డ్ నిర్మాణానికి వ్యతిరేకంగా బీజేపీ నిరసన. వద్దన్నపేటలో ఉన్న డంపింగ్ యార్డ్ ను ఇక్కడ ఖాళీ స్థలం ఉందని డంపింగ్ యార్డ్ ను తరలించడం సమంజసం కాదని దీనివల్ల, చుట్టుపక్కల ఉన్న భూములు నిస్సారమవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. కడియం శ్రీహరి అధికారంలో ఉన్నప్పుడు అక్కడి వారికి వాగ్దానం చేసి రెండు సంవత్సరాలలో తరలిస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు తరలించడం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు.
గతం నుండే వద్దని చెబుతున్నాం..
2025 సంవత్సరం నుండి ఇక్కడ డంపింగ్ గాడు వద్దని బిజెపి నాయకులు ఎన్ని మాటలు ప్రభుత్వానికి తెలిసే విధంగా చర్యలు చేపట్టిన తనలు తెలిపిన ప్రభుత్వం స్పందించకుండా కాలయాపన చేస్తుందని అన్నారు. ఇక్కడి నుండి గెలిచిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇక్కడి వారికి ఉద్యోగాలు వస్తాయని నాడు మాయ మాటలు చెప్పి ఇప్పుడు వద్దనడం చాలా హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రభుత్వ భూమి ఉందని డంపింగ్ యార్డ్ ఇక్కడికి తరలించడం చుట్టుపక్కల భూములు కూడా నిరుపయోగంగా మారుతాయి అనే విషయాన్ని నాయకులు గమనించాలన్నారు.
నాడు అనుమతించి నేడు వద్దనడం హాస్యాస్పదం..
హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అసెంబ్లీలో నెత్తి నోరు కొట్టుకొని వద్దంటున్నానని అనడం కాదు రద్ద అయ్యేంతవరకు మాతో సహకరించి పోరాటం చేయండి అని బిజెపి నాయకులు పలికారు. నాడు హుజరాబాద్ ప్రజలను 200 ఉద్యోగాలు వస్తాయని మభ్యపెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. ఆరోజు నీకు కళ్ళు కనిపించలేదా పంట పొలాలు నాశనమవుతాయని, ఉగాల్లు వస్తాయని మాట దేవుడెరుగు దానివల్ల ఎన్ని అనర్ధాలు దాపరిస్తాయో తెలుసుకొని మెలగాల్సిన ఒక నాయకుడు ఇలా పరి పరి విధాల మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు.
అర్ డీ ఓ కి వినతి పత్రం అందజేసిన బీజేపీ నాయకులు.
డంపింగ్ యార్డ్ రద్దు చేయాలని ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించిన బిజెపి నాయకులు అంతరం హుజరాబాద్ ఆర్డిఓ కి వినతి పత్రం అందించారు. కచ్చితంగా డంపింగ్ యార్డ్ ను రద్దు చేయాలని లేదంటే రాబోవు రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలను చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలువురు బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.