Gangadhara: ఎండిన పంటలు.. అన్నదాతల కన్నీరు!
Gangadhara: కరీంనగర్ జిల్లా గంగాధర మండలం ఉప్పర మల్యాలలో ఎండిపోయిన పంట పొలాలను తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకుడు కొప్పుల వెంకటేష్ సందర్శించారు.
Gangadhara: ఎండిన పంటలు.. అన్నదాతల కన్నీరు!
కరీంనగర్ జిల్లా గంగాధర మండలం ఉప్పర మల్యాల గ్రామ పరిధిలో ఎండిపోయిన పంట పొలాలను తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకుడు కొప్పుల వెంకటేష్ సందర్శించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నారాయణపూర్ రిజర్వాయర్ కుడి కాలువ నిర్మాణం పూర్తికాకపోవడమే ఈ పరిస్థితికి ప్రధాన కారణమని ఆయన పేర్కొన్నారు.
చెరువుకు సమీపంలో ఉన్న పొలాలు కూడా నీరు లేక ఎండిపోవడం బాధాకరమని తెలిపారు. వెంటనే కాలువ పనులు పూర్తి చేసి రైతులకు నీటి సౌకర్యం కల్పించాలని, అలాగే ఎండిపోయిన పంటలకు ఎకరానికి రూ.30,000 చొప్పున నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాజాధికార పార్టీ చొప్పదండి నియోజకవర్గం ఇన్చార్జి కొప్పుల వెంకటేష్ గంగాధర మండల అధ్యక్షుడు ముక్కెర గంగరాజు యువజన విభాగం అధ్యక్షుడు పలుమూరి సతీష్ యూత్ ప్రధాన కార్యదర్శి బండ గంగారాజు గుండవేణి నరేష్ మరియు స్థానిక రైతులు పాల్గొన్నారు