Jagtial: నల్లగొండ నారసింహుని చెంత కొత్త ఈఓ!
Jagtial: జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నల్లగొండలోని ప్రసిద్ధ శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం నూతన కార్యనిర్వాహణ అధికారి (EO)గా వి. అనూష బాధ్యతలు స్వీకరించారు.
Jagtial: నల్లగొండ నారసింహుని చెంత కొత్త ఈఓ!
Jagtial: జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నల్లగొండలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో కార్యనిర్వాహణ అధికారిగా వి. అనూష బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయానికి చేరుకున్న ఆమెకు సిబ్బంది ఘన స్వాగతం పలుకుతూ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామివారి ఆశీస్సులు పొందారు.
ఈ సందర్భంగా ఈఓ వి. అనూష మాట్లాడుతూ, దేవస్థానం అభివృద్ధి కోసం కృషి చేస్తానని, భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించడమే ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఆలయ నిర్వహణలో పారదర్శకత పాటిస్తూ, పూజా కార్యక్రమాలు నియమ నిష్ఠలతో కొనసాగేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. అలాగే భక్తుల సమస్యలను తక్షణమే పరిష్కరించే విధంగా ప్రత్యేక దృష్టి సారిస్తామని పేర్కొన్నారు.
స్థానిక ప్రజలు, ఆలయ సిబ్బంది సహకారంతో దేవస్థానాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తామని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.