Tandur: బకాయిలు చెల్లించరా? అయితే ఇదిగో ట్రీట్మెంట్!

Tandur: వికారాబాద్ జిల్లా తాండూరులో మున్సిపల్ పన్ను బకాయిల వసూలు కోసం అధికారులు వినూత్న చర్యలు చేపట్టారు.

Update: 2026-03-30 08:51 GMT

Tandur: బకాయిలు చెల్లించరా? అయితే ఇదిగో ట్రీట్మెంట్!

Tandur: వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో పెట్రోల్ పంపు నిర్వాహకులు గత 5 సంవత్సరాల నుండి మున్సిపల్ కు చెల్లించాల్సిన ₹82 000 రూ “ల టాక్స్ ను చెల్లించకపోవడంతో మున్సిపల్ వాహనాలను పెట్రోల్ పంపు చుట్టూ అడ్డంగా పెట్టి వినూత్న రీతిలో టాక్సీ వసూలు చేసేందుకు మున్సిపల్ అధికారుల ముమ్మర ప్రయత్నం.

ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా నోటీసులు జారీచేసినా ఎలాంటి స్పందన లేకపోవడంతో మున్సిపల్ చెత్తతో కూడుకున్న వాహనాలను అడ్డంగా పెట్టి నిరసన తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. అలాగే మిగతా టాక్స్ చెల్లించని భవన యజమానుల ఇళ్ళ ముందు పెద్ద మొత్తంలో టాక్స్ ఎగ్గొట్టిన వాళ్లపై కూడా ఇలాంటి చర్యలు చేపడుతూ నిరసనలు కొనసాగిస్తామని అన్నారు.

Tags:    

Similar News