Realme: యూత్ ను టార్గెట్ చేసిన రియల్ మీ.. త్వరలో అందుబాటులోకి మరో 2 మోడళ్లు..?

Realme 16T: భారత్‌లో స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను ఆకట్టుకుంటున్న రియల్ మీ మరోసారి కొత్త మోడళ్లతో కనువిందు చేసేందుకు సిద్ధమైంది. రియల్ మీ 16T, రియల్ మీ P4R త్వరలో లాంచ్ కానున్నట్లు లీకులు సూచిస్తున్నాయి.

Update: 2026-03-18 04:57 GMT

Realme: యూత్ ను టార్గెట్ చేసిన రియల్ మీ.. త్వరలో అందుబాటులోకి మరో 2 మోడళ్లు..?

Realme 16T India Launch: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme భారత మార్కెట్‌లో తన లైనప్‌ను విస్తరించడానికి సిద్ధమవుతోంది. తాజా లీకుల ప్రకారం Realme 16T మరియు Realme P4R పేర్లతో రెండు కొత్త ఫోన్లు త్వరలో విడుదల కావొచ్చని సమాచారం. కంపెనీ అధికారికంగా ప్రకటించకపోయినా, లీకులు ఈ లాంచ్ సమీపంలోనే ఉందని సూచిస్తున్నాయి.

టిప్‌స్టర్ లీక్ చేసిన వివరాలు..

ప్రముఖ టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ తన సోషల్ మీడియా ఖాతాలో ఈ రెండు ఫోన్ల గురించి కీలక సమాచారం అందించాడు. రియల్ మీ 16T మోడల్ నంబర్ RMX5268 కాగా, రియల్ మీ P4R మోడల్ నంబర్ RMX5266గా గుర్తించారు. అయితే, ఖచ్చితమైన లాంచ్ తేదీ మాత్రం ఇంకా వెల్లడించలేదు.

కాగా, Realme 16T మూడు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

6GB RAM + 128GB స్టోరేజ్

8GB RAM + 128GB స్టోరేజ్

8GB RAM + 256GB స్టోరేజ్

ఇక Realme P4R కూడా మూడు వేరియంట్లలో రానున్నట్లు తెలుస్తోంది.

4GB RAM + 128GB

6GB RAM + 128GB

6GB RAM + 256GB

ఈ మోడళ్లతో మిడిల్ క్లాస్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది.

కలర్ ఆప్షన్లు కూడా ఆకర్షణీయంగా..

రియల్ మీ 16T ఫోన్ స్టార్‌లైట్ రెడ్, అరోరా గ్రీన్, స్టార్‌లైట్ బ్లాక్ రంగుల్లో లాంచ్ కావొచ్చని తెలుస్తోంది.

రియల్ మీ P4R మాత్రం సిల్వర్ గ్లేర్, టైటానియం గ్లేర్, లావెండర్ గ్లేర్ కలర్స్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ కొత్త కలర్స్ యూత్‌ను ఆకర్షించేలా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది.

రియల్ మీ పీ4 లైట్ 5జీ కూడా రెడీ..

ఇక రియల్ మీ పీ4 లైట్ 5జీ (Realme P4 Lite 5G) ఫోన్ భారత్‌లో త్వరలోనే విడుదల కానుంది. ఇది 6.8 ఇంచ్ డిస్‌ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. మీడియా టెక్ డైమెన్సిటీ (MediaTek Dimensity) 6300 ప్రాసెసర్, 7000mAh భారీ బ్యాటరీతో ఈ ఫోన్ మంచి పనితీరును అందించనుంది. ఒక్కసారి చార్జ్ చేస్తే 1.5 రోజుల వరకు బ్యాటరీ నిలవనుందని కంపెనీ చెబుతోంది.

Tags:    

Similar News