WhatsApp Guest Chats: వాట్సాప్‌లో ‘గెస్ట్ చాట్స్’ ఫీచర్.. అకౌంట్ లేకుండానే చాట్ చేయొచ్చు, కండిషన్స్ అప్లై!

WhatsApp Guest Chats Feature: తాజాగా వాట్సప్‌ మరో సరికొత్త ఫీచర్‌ను తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. 'గెస్ట్ చాట్స్' పేరుతో ఈ ఫీచర్ ప్రస్తుతం పరిమిత స్థాయిలో టెస్టింగ్ దశలో ఉంది. ఈ ఫీచర్ ద్వారా వాట్సాప్ అకౌంట్ లేని వ్యక్తులతో కూడా చాట్ చేయగలగడం ప్రత్యేకతగా చెప్పుకోవాలి.

Update: 2026-03-17 14:26 GMT

WhatsApp Guest Chats: వాట్సాప్‌లో ‘గెస్ట్ చాట్స్’ ఫీచర్.. అకౌంట్ లేకుండానే చాట్ చేయొచ్చు, కండిషన్స్ అప్లై!

WhatsApp Guest Chats: ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ 'వాట్సప్‌' ఎప్పటికపుడు కొత్త ఫీచర్లను తన యూజర్లకు అందిస్తుంటుంది. ఇటీవలే 13 ఏళ్లలోపు పిల్లల కోసం 'పేరెంట్‌-మేనేజ్డ్‌' మోడల్‌ను లాంచ్‌ చేసింది. తాజాగా వాట్సప్‌ మరో సరికొత్త ఫీచర్‌ను తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. 'గెస్ట్ చాట్స్' పేరుతో ఈ ఫీచర్ ప్రస్తుతం పరిమిత స్థాయిలో టెస్టింగ్ దశలో ఉంది. ఈ ఫీచర్ ద్వారా వాట్సాప్ అకౌంట్ లేని వ్యక్తులతో కూడా చాట్ చేయగలగడం ప్రత్యేకతగా చెప్పుకోవాలి. దీంతో 'మెటా' తన మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్‌ను మరింత విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావాలని ప్రయత్నిస్తోంది.

ఇన్విటేషన్ లింక్‌ తప్పనిసరి:

గెస్ట్ చాట్స్ ఫీచర్‌ను ప్రస్తుతం ఆండ్రాయిడ్, ఐఓఎస్ సహా వెబ్ వెర్షన్‌లలోని పరిమిత బీటా వినియోగదారులకు అందుబాటులో ఉంది. పరిమిత సంఖ్యలో టెస్టింగ్ చేస్తోంది. ఈ గెస్ట్ చాట్స్ ఫీచర్ ఎలా పనిచేస్తుందంటే… ముందుగా వినియోగదారులు ఒక సెక్యూర్ ఇన్విటేషన్ లింక్‌ను రూపొందించాలి. దాన్ని ఎస్ఎంఎస్, ఈమెయిల్ లేదా ఇతర మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా షేర్ చేయవచ్చు. ఆ లింక్‌ను ఓపెన్ చేసిన వ్యక్తి వాట్సాప్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. లేదా నేరుగా వెబ్ బ్రౌజర్‌లో గెస్ట్‌గా చాట్‌లో చేరవచ్చు. గెస్ట్ యూజర్‌కు ప్రత్యేకమైన ఐడెంటిఫైయర్ ఇవ్వబడుతుంది. ఇది ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ కీలా పనిచేస్తుంది. అలాగే క్యూర్ కోడ్ లేదా సెక్యూరిటీ కోడ్ ద్వారా చాట్ భద్రతను కూడా వెరిఫై చేసుకోవచ్చు.

పరిమితులు కూడా:

గెస్ట్‌గా చాట్‌లో చేరే ముందు యూజర్ ఒక డిస్‌ప్లే నేమ్ ఇవ్వాలి. అయితే ఈ పేరు అసలైందో కాదో వాట్సాప్ వెరిఫై చేయదు. గెస్ట్ యూజర్లతో జరిగే చాట్స్ 'గెస్ట్‌' అనే లేబుల్‌తో స్పష్టంగా చూపించబడతాయి. దాంతో పారదర్శకత ఉంటుంది. అయితే ఈ ఫీచర్‌కు కొన్ని పరిమితులు కూడా ఉన్నాయి. గెస్ట్ చాట్స్ తాత్కాలికంగా మాత్రమే పని చేస్తాయి. కేవలం టెక్స్ట్ మెసేజింగ్‌కు మాత్రమే ఈ ఫీచర్ పరిమితం. ఫోటోలు, వీడియోలు, వాయిస్ నోట్స్, కాల్స్, గ్రూప్ చాట్స్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉండవు. అలాగే కొంత సమయం యాక్టివిటీ లేకపోతే సెషన్ ఆటోమేటిక్‌గా ముగుస్తుంది. మళ్లీ చాట్ కొనసాగించాలంటే.. కొత్త ఇన్విటేషన్ లింక్ తప్పనిసరి.

భద్రతాపరమైన ఆందోళనలు:

గెస్ట్ చాట్స్ ఫీచర్‌ ద్వారా ఇన్విటేషన్ లింక్ ఇతరులకు వెళ్లే ప్రమాదం ఉండటంతో భద్రతాపరమైన ఆందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయినప్పటికీ ఈ ఫీచర్ ద్వారా వాట్సాప్ తన సేవలను మరింత అందుబాటులోకి తీసుకురావాలనే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఫీచర్ ఎప్పుడు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుందో మాత్రం వాట్సప్‌ ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. రానున్న రోజుల్లో గెస్ట్ చాట్స్ ఫీచర్‌గురించి మరింత సమాచారం తెలియరానుంది.

Tags:    

Similar News