POCO X8 Pro Max: 9000mAh బ్యాటరీతో విడుదలైన పోకో ప్రో మ్యాక్స్.. ఫీచర్లు, ధర ఎలా ఉన్నాయంటే?
POCO X8 Pro Max: POCO X8 Pro Max: స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో మరో సంచలనం సృష్టిస్తూ POCO X8 Pro సిరీస్ భారత్‌లో లాంచ్ అయింది. Pro Max మోడల్ భారీ 9000mAh బ్యాటరీతో ఆకట్టుకుంటుండగా, Pro వేరియంట్ శక్తివంతమైన మీడియాటెక్ చిప్‌తో వస్తోంది.
POCO X8 Pro Max: 9000mAh బ్యాటరీతో విడుదలైన పోకో ప్రో మ్యాక్స్.. ఫీచర్లు, ధర ఎలా ఉన్నాయంటే?
POCO X8 Pro Max: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ POCO, భారత మార్కెట్‌లో తన కొత్త X8 Pro సిరీస్‌ను విడుదల చేసింది. ఈ సిరీస్‌లో POCO X8 Pro, POCO X8 Pro Max మోడళ్లు ఉన్నాయి. అధునాతన ఫీచర్లు, శక్తివంతమైన ప్రాసెసర్లు, భారీ బ్యాటరీ సామర్థ్యంతో ఈ ఫోన్లు మిడ్-ప్రీమియం సెగ్మెంట్‌లో పోటీని పెంచనున్నాయి.
ధరలు..
POCO X8 Pro Max ధర రూ.42,999 నుంచి ప్రారంభమవుతుంది. 12GB RAM + 512GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.46,999లుగా ఉంది.
POCO X8 Pro ధర రూ.32,999 నుంచి మొదలవుతుంది. Iron-Man లిమిటెడ్ ఎడిషన్ ధర రూ.37,999గా ఉంది.
ఈ ఫోన్లు మార్చి 23న మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్ కార్ట్ (Flipkart)లో అమ్మకాలకు అందుబాటులో ఉంటాయి.
ప్రత్యేక ఆఫర్లు..
POCO వినియోగదారులకు పలు ఆకర్షణీయమైన ఆఫర్లు అందిస్తోంది:
* రూ.3,000 బ్యాంక్ డిస్కౌంట్ లేదా ఎక్స్చేంజ్ బోనస్
* 12 నెలల వరకు నో-కాస్ట్ EMI
* స్పోర్టిఫై ప్రీమియం 3 నెలలు ఉచితం
* యూట్యూబ్ ప్రీమియం 2 నెలలు ఉచితం
* పోకో షీల్డ్ (1 సంవత్సరం వారంటీ + స్క్రీన్ ప్రొటెక్షన్)
POCO X8 Pro Max: ఫీచర్ల హైలైట్స్
POCO X8 Pro Maxలో 6.83 అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 3500 నిట్స్ బ్రైట్‌నెస్ అందుబాటులో ఉన్నాయి. మీడియా టెక్ డైమెన్సిటీ (MediaTek Dimensity) 9500s ప్రాసెసర్ దీనికి శక్తినిస్తుంది.
50MP + 8MP డ్యూయల్ కెమెరా సెటప్, 20MP సెల్ఫీ కెమెరా అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా 9000mAh భారీ బ్యాటరీ, 100W ఫాస్ట్ చార్జింగ్ ఈ ఫోన్ ప్రత్యేకత.
IP69K రేటింగ్, డాల్బీ అట్మాస్ సపోర్ట్‌తో ఈ ఫోన్ మరింత ఆకర్షణీయంగా మారింది.
POCO X8 Pro: పవర్ తోపాటు స్టైల్..
POCO X8 Proలో 6.59 అంగుళాల AMOLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 8500 అల్ట్రా చిప్‌తో ఇది మంచి పనితీరును అందిస్తుంది.
50MP ప్రధాన కెమెరా, 20MP సెల్ఫీ కెమెరాతో ఫోటోగ్రఫీ కూడా మెరుగ్గా ఉంటుంది. 6500mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఈ ఫోన్‌ను ప్రత్యేకంగా నిలబెడతాయి.
ఇంకా Iron-Man ఎడిషన్‌లో ప్రత్యేక UI, డిజైన్ కూడా అందుబాటులో ఉంది.
POCO X8 Pro సిరీస్ శక్తివంతమైన బ్యాటరీ, అధునాతన ప్రాసెసర్లు, ఆకర్షణీయ ధరలతో మార్కెట్‌లో మంచి స్పందన పొందే అవకాశముంది. ముఖ్యంగా Pro Max మోడల్ భారీ బ్యాటరీతో గేమింగ్, హేవీ యూజ్ కోసం ఉత్తమ ఎంపికగా నిలుస్తుంది.