Cheapest EV India: 421 కిమీల మైలేజీ.. 6 ఎయిర్‌బ్యాగ్‌లు.. మిడిల్ క్లాస్ మెచ్చే బెస్ట్ బడ్జెట్ ఎలక్ట్రిక్ కార్స్..

Cheapest EV India: భారత్‌లో ఎలక్ట్రిక్ కార్ల డిమాండ్ రోజురోజుకు పెరుగుతోంది. కానీ ఎక్కువ ధరల కారణంగా చాలా మంది వెనుకడుగు వేస్తున్నారు. ఇప్పుడు తక్కువ బడ్జెట్‌లోనే మంచి రేంజ్, సేఫ్టీ ఫీచర్లతో అందుబాటులో ఉన్న కొన్ని బెస్ట్ ఈవీ కార్లు మార్కెట్లో ఉన్నాయి. ఇవి మిడిల్ క్లాస్‌కు అద్భుత ఎంపికలుగా నిలుస్తున్నాయి.

Update: 2026-03-18 05:31 GMT

Cheapest EV India: 421 కిమీల మైలేజీ.. 6 ఎయిర్‌బ్యాగ్‌లు.. మిడిల్ క్లాస్ మెచ్చే బెస్ట్ బడ్జెట్ ఎలక్ట్రిక్ కార్స్..

Affordable Electric Cars India: ప్రస్తుతం పెట్రోల్ ధరలు పెరుగుతున్న తరుణంలో, చాలా మంది ఎలక్ట్రిక్ కార్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం ఇండియన్ మార్కెట్‌లో ఎంజీ కామెంట్ (MG Comet EV), టాటా టియాగో (Tata Tiago EV), టాటా పంచ్ (Tata Punch EV), సిట్రోయెన్ ఈసీ3 (Citroen eC3), టాటా టైగొర్ (Tata Tigor EV) వంటి మోడళ్లు తక్కువ ధరలో అందుబాటులో ఉన్నాయి. ఈ మోడళ్లు తక్కువ ధరలో మంచి మైలేజ్ ఉత్తమ ఎలక్ట్రిక్ కార్లుగా నిలిచాయి.

ఎంజీ కామెట్ (MG Comet EV): అతి తక్కువ ధర..

ఎంజీ కామెట్ ఈవీ దేశంలో అతి చౌకైన ఎలక్ట్రిక్ కార్‌గా నిలిచింది. దీని ధర రూ. 7.50 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. అయితే బాస్ (BaaS) స్కీమ్‌తో కొనుగోలు చేస్తే రూ. 4.99 లక్షలకే లభిస్తుంది. 17.3 kWh బ్యాటరీతో ఈ కార్ సుమారు 230 కిమీ రేంజ్ ఇస్తుంది. చిన్న సైజ్, స్మార్ట్ ఫీచర్ల వల్ల నగర ప్రయాణాలకు ఇది సరైన ఎంపిక.

టాటా టియాగో (Tata Tiago EV): మిడిల్ క్లాస్ ఫేవరెట్..

టాటా టియాగో (Tata Tiago EV) రూ. 7.99 లక్షల ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది. 19.2 kWh, 24 kWh బ్యాటరీ ఆప్షన్లతో 250 నుంచి 315 కిమీల రేంజ్ అందిస్తుంది. క్రూజ్ కంట్రోల్, రీజెనరేటివ్ బ్రేకింగ్ వంటి ఫీచర్లతో ఇది వాల్యూ ఫర్ మనీ కార్‌గా నిలుస్తోంది.

టాటా పంచ్ (Tata Punch EV): ఎస్ యూవీ లుక్‌తో పవర్..

ఎస్ యూవీ లుక్ కోరుకునే వారికి టాటా పంచ్ ఈవీ మంచి ఎంపిక. దీని ధర రూ. 9.69 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. 25 kWh, 35 kWh బ్యాటరీలతో గరిష్టంగా 421 కిమీ రేంజ్ అందిస్తుంది. డిజిటల్ డ్యాష్‌బోర్డ్, సన్‌రూఫ్ వంటి ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి.

సిట్రోయెన్ ఈసీ3 (Citroen eC3): కంఫర్ట్‌కు బెస్ట్

సిట్రోయెన్ ఈసీ3 రూ. 12.90 లక్షల నుంచి అందుబాటులో ఉంది. 315 లీటర్ల బూట్ స్పేస్, సాఫ్ట్ సస్పెన్షన్ వల్ల ఇది లాంగ్ డ్రైవ్స్‌కు అనువైన కార్ గా నిలిచింది. రోడ్లపై గుంతలు ఉన్నా కూడా స్మూత్ డ్రైవింగ్ అనుభవాన్ని ఇస్తుంది.

టాటా టిగోర్ (Tata Tigor EV): సేఫ్టీతో సెడాన్..

టాటా టిగోర్ (Tata Tigor EV) రూ. 12.49 లక్షల నుంచి లభిస్తుంది. 26 kWh బ్యాటరీతో 315 కిమీల రేంజ్ ఇస్తుంది. 4-స్టార్ గ్లోబల్ NCAP రేటింగ్, ఆటో క్లైమేట్ కంట్రోల్, హార్మన్ సిస్టమ్ వంటి ఫీచర్లతో ఇది ఫ్యామిలీకి సేఫ్ ఆప్షన్.


Tags:    

Similar News