Netflix Free : నెట్‌ఫ్లిక్స్ అదిరిపోయే ఆఫర్.. మళ్లీ ఉచిత ట్రయల్స్ షురూ!.

Netflix Free : ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ తమ సరికొత్త వినియోగదారుల కోసం ఒక అద్భుతమైన వార్తను మోసుకొచ్చింది. గతంలో నిలిపివేసిన అత్యంత ప్రజాదరణ

Update: 2026-07-10 06:29 GMT

Netflix

Netflix Free : ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ తమ సరికొత్త వినియోగదారుల కోసం ఒక అద్భుతమైన వార్తను మోసుకొచ్చింది. గతంలో నిలిపివేసిన అత్యంత ప్రజాదరణ పొందిన 'ఉచిత సబ్‌స్క్రిప్షన్' ప్రయోజనాన్ని నెట్‌ఫ్లిక్స్ మళ్లీ సైలెంట్‌గా అందుబాటులోకి తెస్తోంది. కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకునే వారికి ఈ ఉచిత ఆఫర్ లభిస్తున్నట్లు ప్రపంచవ్యాప్తంగా పలువురు యూజర్లు వెల్లడించారు. దాదాపు ఆరేళ్ల క్రితం అంటే 2020లో నిలిపివేసిన ఈ ఫ్రీ ట్రయల్ విధానాన్ని తిరిగి ప్రారంభిస్తున్నట్లు కంపెనీ కూడా ధృవీకరించింది. దీనివల్ల సరికొత్త యూజర్లు నెట్‌ఫ్లిక్స్‌లోని మూవీస్, సిరీస్‌లను ఉచితంగా చూసి ఆస్వాదించే అవకాశం లభిస్తుంది.

అందరికీ ఒకేలా ఉండదు..

నెట్‌ఫ్లిక్స్ హెల్ప్ సెంటర్ తెలిపిన వివరాల ప్రకారం కొత్తగా సైన్-అప్ అయ్యే యూజర్ అకౌంట్, డివైజ్ , లొకేషన్ అర్హతలను బట్టి ఈ ఉచిత ట్రయల్ ఆఫర్ ఆటోమేటిక్‌గా స్క్రీన్‌పై కనిపిస్తుంది. అయితే ఈ ఆఫర్ వ్యవధి అందరికీ ఒకేలా ఉండటం లేదు. కొందరికి 30 రోజుల ఫ్రీ ట్రయల్ కనిపిస్తుంటే, మరికొందరికి 15 రోజుల ట్రయల్ మాత్రమే చూపిస్తోంది. కంపెనీ ప్రస్తుతం 'A/B టెస్టింగ్' విధానాన్ని అవలంబిస్తుండటం వల్లే ఇలా వేర్వేరు యూజర్లకు వేర్వేరు ప్రమోషనల్ ఆఫర్లు కనిపిస్తున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. భారతదేశంలో కూడా ఒక కొత్త ఈమెయిల్ ఐడీతో లాగిన్ అవ్వడానికి ప్రయత్నించినప్పుడు ‘Try 30 days for ₹0’ అనే ఆఫర్ లభిస్తున్నట్లు టెక్ వర్గాలు గుర్తించాయి.

ఫ్రీ ట్రయల్ ఎలా పొందాలో తెలుసా..?

నెట్‌ఫ్లిక్స్ ఉచిత ట్రయల్‌ను క్లెయిమ్ చేసుకోవడం చాలా సులభం. దీనికోసం మొదట నెట్‌ఫ్లిక్స్ వెబ్‌సైట్ లేదా యాప్‌ను ఓపెన్ చేసి, ఇంతకుముందెన్నడూ నెట్‌ఫ్లిక్స్‌లో ఉపయోగించని సరికొత్త ఈమెయిల్ ఐడీతో కొత్త అకౌంట్ క్రియేట్ చేయాలి. సైన్-అప్ ప్రక్రియలో 'Try 30 days for ₹0' లేదా '15-day free trial' అనే బ్యానర్ కనిపిస్తే ఆఫర్ ఉన్నట్లు అర్థం. ఆ తర్వాత మీకు నచ్చిన ఒక ప్లాన్‌ను సెలెక్ట్ చేసుకుని, మీ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ లేదా సపోర్టెడ్ యూపీఐ ద్వారా పేమెంట్ వివరాలను నమోదు చేసి రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి. ఇలా రిజిస్ట్రేషన్ పూర్తయిన వెంటనే ఎలాంటి ఛార్జీలు పడకుండా ఉచితంగా సినిమాలను ఆస్వాదించవచ్చు.

ఈ ఒక్క విషయం తప్పక గుర్తుంచుకోండి

ఈ ఆఫర్ పొందే క్రమంలో వినియోగదారులు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. నెట్‌ఫ్లిక్స్‌లో డీఫాల్ట్‌గా 'ఆటో-పే' ఆప్షన్ ఎనేబుల్ అయి ఉంటుంది. అంటే మీ ఫ్రీ ట్రయల్ గడువు ముగిసేలోపు మీరు సబ్‌స్క్రిప్షన్‌ను క్యాన్సిల్ చేసుకోకపోతే, మీరు ఎంచుకున్న ప్లాన్ ఆటోమేటిక్‌గా రీన్యూ అయి మీ బ్యాంక్ అకౌంట్ నుండి డబ్బులు కట్ అవుతాయి. కాబట్టి ఉచిత సర్వీస్ మాత్రమే కావాలనుకునే వారు ట్రయల్ పీరియడ్ ముగిసే ముందే దానిని క్యాన్సిల్ చేసుకోవడం ఉత్తమం. ఓటీటీ మార్కెట్లో సబ్‌స్క్రిప్షన్ల సంఖ్యను , వినియోగదారులను మరింత పెంచుకునే వ్యూహంలో భాగంగానే నెట్‌ఫ్లిక్స్ ఈ పాత ఫ్రీ ట్రయల్ ఆఫర్‌ను మళ్లీ తెరపైకి తెచ్చినట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News