iPhone 18 Pro : ఆపిల్ లవర్స్‌కు షాక్.. మరింత లావుగా రాబోతున్న ‘ఐఫోన్ 18 ప్రో’..!

iPhone 18 Pro : టెక్ దిగ్గజం ఆపిల్ (Apple) తన ప్రతిష్టాత్మక నెక్స్ట్ జనరేషన్ స్మార్ట్‌ఫోన్ సిరీస్ ‘ఐఫోన్ 18’ (iPhone 18) లాంచ్‌కు సిద్ధమవుతోంది. ఆపిల్..

Update: 2026-07-08 12:43 GMT

iphone 18 pro

iPhone 18 Pro : టెక్ దిగ్గజం ఆపిల్ (Apple) తన ప్రతిష్టాత్మక నెక్స్ట్ జనరేషన్ స్మార్ట్‌ఫోన్ సిరీస్ ‘ఐఫోన్ 18’ (iPhone 18) లాంచ్‌కు సిద్ధమవుతోంది. ఆపిల్ కంపెనీ సాధారణ టైమ్‌లైన్ ప్రకారం ఐఫోన్ 18 ప్రో , ప్రొ మ్యాక్స్ మోడళ్లు ఈ ఏడాది సెప్టెంబర్‌లో విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే, ఈ ఫోన్ల అధికారిక ప్రకటన కంటే ముందే చైనా నుండి ఒక ఆసక్తికరమైన లీక్ బయటకు వచ్చింది. మునుపటి మోడళ్లతో పోలిస్తే రాబోయే 'ఐఫోన్ 18 ప్రో' (iPhone 18 Pro) మోడల్ మునిపటికంటే మందంతో (Thicker), ముఖ్యంగా కెమెరా మాడ్యూల్ భాగంలో చాలా లావుగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

మునుపటి కంటే 2 మిమీ పెరగనున్న మందం

చైనాకు చెందిన ప్రముఖ టిప్‌స్టర్ 'ఫిక్స్‌డ్ ఫోకస్ డిజిటల్' వెల్లడించిన వివరాల ప్రకారం.. ఐఫోన్ 18 ప్రో మోడల్ తన ఐఫోన్ 17 ప్రో తరహాలోనే అల్యూమినియం అలాయ్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. అయితే, దీని అల్యూమినియం ఫ్రేమ్ , కెమెరా ప్యానెల్ మునుపటి కంటే చాలా మందంగా ఉండనున్నాయి. ప్రముఖ సప్లయర్ 'టాటా ఎలక్ట్రానిక్స్' (Tata Electronics) నుండి లీకైన చిత్రాలను బట్టి చూస్తే, ఐఫోన్ 18 ప్రో మొత్తం ప్రొఫైల్ దాని మునుపటి మోడల్ కంటే దాదాపు 2 మిమీ (2mm) అదనపు మందాన్ని కలిగి ఉండబోతోంది. సమాచారం కోసం చూస్తే.. ఐఫోన్ 16 ప్రో 8.25mm మందం, ఐఫోన్ 17 ప్రో 8.75mm మందంతో వచ్చాయి. ఇప్పుడు రాబోయే మోడల్ వీటన్నింటికంటే కాస్త బరువుగా, లావుగా కనిపించనుంది.

కెమెరా రీడిజైన్ , పెద్ద బ్యాటరీయే కారణం

ఐఫోన్ సైజు ఇంతలా పెరగడానికి ప్రధాన కారణం అందులో తీసుకురాబోతున్న కెమెరా అప్‌గ్రేడ్స్ అని తెలుస్తోంది. ఐఫోన్ 18 ప్రో లో మొదటిసారిగా మెయిన్ కెమెరా కోసం 'వేరియబుల్ అపెర్చర్' (Variable Aperture) ఫీచర్‌ను ఆపిల్ ప్రవేశపెట్టబోతోంది. దీనివల్ల కెమెరా సిస్టమ్ లోపల మెకానికల్ మార్పులు జరిగి, ఆ భాగం మరింత ముందుకు ఉబ్బినట్లుగా మారుతుంది. కెమెరాతో పాటు బ్యాటరీ సామర్థ్యాన్ని కూడా ఆపిల్ భారీగా పెంచుతోంది. చైనా 3C రెగ్యులేటరీ డేటాబేస్ ప్రకారం, ఈ ఫోన్ చైనీస్ వెర్షన్‌లో 4,056mAh బ్యాటరీని, అలాగే యూఎస్ (US) మోడల్‌లో 4,288mAh సామర్థ్యం గల పెద్ద బ్యాటరీని అమర్చనున్నారు.

అదిరిపోయే స్పెసిఫికేషన్లు , లాంచ్ వివరాలు

ఐఫోన్ 18 ప్రో బ్యాక్ ప్యానెల్‌లో ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ ఉండనుంది. ఇందులో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 48 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా , 48 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఇవ్వబోతున్నారు. అంటే వెనుక వైపు ఉన్న మూడు కెమెరాలు కూడా 48MP సామర్థ్యంతోనే రావడం విశేషం. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఇందులో అత్యంత విప్లవాత్మకమైన 2nm ప్రాసెస్‌పై తయారైన 'A20 చిప్‌సెట్' (A20 Chipset) ను ఉపయోగించనున్నారు.

ఈ ఏడాది సెప్టెంబర్‌లో జరగబోయే ఆపిల్ ఈవెంట్‌లో ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్‌లతో పాటు ఆపిల్ సంస్థ తయారుచేసిన మొట్టమొదటి ఫోల్డబుల్ (మడతబెట్టే) స్మార్ట్‌ఫోన్ కూడా లాంచ్ కానుంది. ఇక సాధారణ వినియోగదారుల కోసం వచ్చే స్టాండర్డ్ ఐఫోన్ 18 (iPhone 18) , ఐఫోన్ 18e (iPhone 18e) మోడళ్లు వచ్చే ఏడాది (2027) మొదటి త్రైమాసికంలో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.

Tags:    

Similar News