ఫేక్ డాక్యుమెంట్స్‌తో సిమ్ కొంటున్నారా.? ఇక మీకు జైలే గతి.! ఇది చూసేయండి

SIM Card Rules: కొత్త సిమ్ కార్డు తీసుకునేటప్పుడు ఫేక్ డాక్యుమెంట్లు ఇస్తున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త!

Update: 2026-07-08 02:21 GMT

ఫేక్ డాక్యుమెంట్స్‌తో సిమ్ కొంటున్నారా.? ఇక మీకు జైలే గతి.! ఇది చూసేయండి

SIM Card Rules: ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్, అందులో సిమ్ కార్డు ఉండటం సర్వసాధారణం అయిపోయింది. అయితే కొందరు సైబర్ నేరగాళ్లు లేదా వ్యక్తులు తమ గుర్తింపును దాచిపెట్టి, ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ కార్డులు తీసుకుని మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి సైబర్ క్రైమ్స్, టెలికాం ఫ్రాడ్స్‌ను అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం సైతం చట్టాలను మరింత కఠినతరం చేస్తోంది.

తాజా నిబంధనల ప్రకారం.. కొత్త సిమ్ కార్డు తీసుకునేటప్పుడు నకిలీ డాక్యుమెంట్లతో ఫ్రాడ్‌కు పాల్పడటాన్ని కేంద్ర ప్రభుత్వం తీవ్రమైన నేరంగా పరిగణిస్తుంది. ఎవరైనా సరే ఫేక్ ఐడీతో సిమ్ తీసుకున్నట్లు పట్టుబడితే, వారికి గరిష్టంగా మూడేళ్ల జైలు శిక్ష లేదా ఏకంగా రూ. 50 లక్షల వరకు భారీ జరిమానా విధించే అవకాశం ఉంది. లేదా ఈ రెండు శిక్షలూ ఒకేసారి పడే ప్రమాదం కూడా లేకపోలేదు.

అంతేకాకుండా, ఒకరి పేరుపై ఉన్న సిమ్ కార్డును వేరొకరు వాడుతున్నప్పుడు.. ఆ సిమ్ గనక ఏదైనా నేరంలో లేదా దుర్వినియోగం అయినట్లు తేలితే, ఆ సిమ్ ఎవరి పేరు మీద (అసలు యూజర్) రిజిస్టర్ అయి ఉందో వారే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. కాబట్టి మీ పేరు మీద ఉన్న సిమ్స్ ఎవరు వాడుతున్నారో అప్రమత్తంగా ఉండటం మంచిది.

అలాగే, మొబైల్ ఫోన్ల IMEI నంబర్ ట్యాంపరింగ్‌పైనా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. అనుమానం ఉన్నవారు తమ పేరు మీద ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో తెలుసుకోవడానికి, తమ డివైజ్ సెక్యూరిటీని చెక్ చేసుకోవడానికి 'సంచార్ సాథీ' పోర్టల్‌లో వెరిఫై చేసుకోవాలని కేంద్రం సూచిస్తోంది. కాబట్టి, టెలికాం నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా ఉండండి.

Tags:    

Similar News