Virat Kohli: ఏక్ బిహారీ సబ్ పే భారీ, ఫిర్ ఖతమ్ గేమ్.. కింగ్ కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు!

Virat Kohli praised Vaibhav Sooryavanshi. ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అదరగొట్టిన విషయం తెలిసిందే.

Update: 2026-06-04 01:27 GMT

Virat Kohli: ఏక్ బిహారీ సబ్ పే భారీ, ఫిర్ ఖతమ్ గేమ్.. కింగ్ కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు!

Virat Kohli: ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అదరగొట్టిన విషయం తెలిసిందే. 16 మ్యాచ్‌ల్లో 776 పరుగులు చేయగా.. అతడి సగటు 48.50గా, స్ట్రైక్ రేట్ 237.30గా నమోదయింది. ఐపీఎల్ చరిత్రలో ఒకే సీజన్‌లో అత్యధిక సిక్సులు (72) బాదిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. అంతేకాదు పవర్‌ప్లేలో 500కు పైగా పరుగులు చేసిన తొలి బ్యాటర్‌గా కూడా మరో రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. ఈ గణాంకాలతో వైభవ్ ప్రపంచ క్రికెట్‌లో కొత్త సంచలనంగా అవతరించాడు. ఇప్పటికే ఎందరో ప్లేయర్స్, మాజీలు బుడ్డోడిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా ఈ జాబితాలో చేరిపోయాడు.

ఐపీఎల్ 2026 ఫైనల్ అనంతరం భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ, వైభవ్ సూర్యవంశీ మధ్య జరిగిన సంభాషణ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన టైటిల్ పోరు ముగిసిన తర్వాత వైభవ్‌ను కింగ్ ప్రత్యేకంగా అభినందిస్తూ విలువైన సలహాలు ఇచ్చాడు. 'నువ్వు ఇప్పటివరకు సాధించినది నీ శ్రమ, నీ ఆత్మవిశ్వాసం వల్లే వచ్చింది. కానీ ఇక్కడితో ఆగిపోవద్దు. ఇంకా ఉన్నత స్థాయికి చేరుకోవాలి. ఇప్పుడు ఎవరు ఏమి మాట్లాడినా పట్టించుకోవాల్సిన అవసరం లేదు' అంటూ ప్రోత్సహించాడు. ప్రశంసలను తలెకెక్కించుకోకుండా ని ఆటపై దృష్టి పెట్టు అని కింగ్ చెప్పుకొచ్చాడు.

ఈ సందర్భంగా విరాట్ కోహ్లీ చెప్పిన ఒక డైలాగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 'ఏక్ బిహారీ సబ్ పే భారీ.. ఫిర్ ఖతమ్ గేమ్' అంటూ వైభవ్‌ సూర్యవంశీని ఉత్సాహపరిచాడు. 'ఒక బిహారీ అందరి పైనా ఆధిపత్యం చెలాయిస్తాడు. అతడు క్రీజులో నిలబడితే మ్యాచ్ ముగిసినట్టే' అని దీని అర్ధం. కింగ్ చెప్పిన చేసిన ఈ వ్యాఖ్యలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఈ 15 ఏళ్ల కుర్రాడు ఐపీఎల్ 2026లో హేమాహేమీ బ్యాటర్లను వెనక్కి నెట్టి.. అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచాడు. ఇప్పుడు బుడ్డోడు ఐపీఎల్‌ వేలంలోకి వస్తే కనీసం రూ.20 కోట్లు పలుకుతాడనే అంచనాలు ఉన్నాయి. ఐపీఎల్ 2027కు ముందు బుడ్డోడిని ఆర్ఆర్ అస్సలు వదులుకోదు.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ 2026 టైటిల్‌ను గెలుచుకున్నప్పటికీ.. వ్యక్తిగత అవార్డులు, రికార్డుల విషయంలో వైభవ్ సూర్యవంశీ పూర్తి ఆధిపత్యం చాటాడు. ఆరెంజ్ క్యాప్, మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్, ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్, సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్, సూపర్ సిక్సెస్ ఆఫ్ ది సీజన్ అవార్డులు అందుకున్నాడు. ఐపీఎల్ 2026 ద్వారా రూ.2.50 కోట్లు సంపాదించాడు. ఇలాంటి సమయంలో విరాట్ కోహ్లీ వంటి దిగ్గజం నుంచి వచ్చిన ప్రశంసలు, సలహాలు యువ బ్యాటర్‌కు మరింత ఆత్మవిశ్వాసాన్ని అందించాయి.వైభవ్ త్వరలోనే టీమిండియాలోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు.

Tags:    

Similar News