Hardik Pandya: హార్దిక్ పాండ్యాకు ముంబై ఇండియన్స్ బిగ్ షాక్
Hardik Pandya: ఐపీఎల్ 2027 సీజన్ కోసం భారీ మార్పులు జరగనున్నాయి.
Hardik Pandya: హార్దిక్ పాండ్యాకు ముంబై ఇండియన్స్ బిగ్ షాక్
MI captain: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రెండోసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడటంతో 2026 సీజన్ ఘనంగా ముగిసింది. రజత్ పాటిదార్ కెప్టెన్సీలో ఆర్‌సీబీ సాధించిన ఈ విజయంపై ప్రశంసల వర్షం కురుస్తోంది. అయితే, ఈ సీజన్ విజయవంతంగా ముగిసినా.. మెజారిటీ ఫ్రాంచైజీలకు కెప్టెన్సీ పరంగా పెద్ద తలనొప్పినే మిగిల్చింది. లక్నో సూపర్ జాయింట్స్ పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలవడంతో రిషభ్ పంత్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో, ఐపీఎల్ 2027 సీజన్ కోసం కనీసం ఐదు ఫ్రాంచైజీలు తమ కెప్టెన్లను మార్చడానికి ప్లాన్ చేస్తున్నాయి. ఆ ఆసక్తికర సమీకరణాలు ఇవే:
రేసులోకి కేఎల్ రాహుల్
గత రెండు సీజన్లుగా అక్షర్ పటేల్ నాయకత్వంలో ఢిల్లీ జట్టు పెద్దగా రాణించలేదు. 2026 సీజన్ లో 6వ స్థానంతో సరిపెట్టుకుంది. పైగా ఈక్వేషన్స్ ప్రకారం ప్లేఆఫ్స్ అవకాశాలు ఉన్నా.. అక్షర్ మధ్యలోనే ఆశలు వదిలేయడం మేనేజ్‌మెంట్‌కు నచ్చలేదు. ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ బాధ్యతలను పూర్తిగా జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ చేపట్టనుండటంతో, వచ్చే సీజన్ లో కేఎల్ రాహుల్‌ను కెప్టెన్ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. గతంలో లక్నో చేదు అనుభవాల వల్ల రాహుల్ కెప్టెన్సీ వద్దనుకున్నా.. ఇప్పుడు 64 మ్యాచ్‌ల్లో 32 విజయాలు అందించిన అతని సీనియారిటీని వాడుకోవాలని ఢిల్లీ భావిస్తోంది.
కోల్‌కతా నైట్ రైడర్స్‌కు రింకూ సింగ్
కోల్‌కతా నైట్ రైడర్స్ 2026 సీజన్ లో మొదటి ఐదు మ్యాచ్‌ల్లోనే ఓడిపోవడంతో కెప్టెన్ అజింక్యా రహానేపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. చివరకు జట్టు 7వ స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. రహానే వయసు ప్రస్తుతం 30 దాటిపోవడం, పైగా బ్యాటింగ్‌లో కేవలం 355 పరుగులే చేసి నిరాశపరచడంతో వచ్చే సీజన్లో అతడిని వదిలేయడం ఖాయంగా కనిపిస్తోంది. 2026కి ముందే వైస్ కెప్టెన్‌గా ఉన్న రింకూ సింగ్, ఐపీఎల్ 2027లో కేకేఆర్ పూర్తి స్థాయి కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకునే అవకాశం ఉంది.
మిచెల్ మార్ష్‌కే లక్నో పీఠం
రిషభ్ పంత్ రాజీనామాతో లక్నో కొత్త కెప్టెన్ కోసం వేట మొదలుపెట్టింది. నికోలస్ పూరన్ పేరు పరిశీలనలో ఉన్నప్పటికీ, ఆస్ట్రేలియా టీ20 కెప్టెన్ మిచెల్ మార్ష్ రేసులో ముందున్నాడు. లక్నో జట్టు చరిత్రలోనే వరుసగా రెండు సీజన్లలో 600 ప్లస్ పరుగులు చేసిన ఏకైక బ్యాటర్‌గా మార్ష్ రికార్డు సృష్టించాడు. పైగా అంతర్జాతీయ స్థాయిలో ఆస్ట్రేలియాను నడిపించి 39 మ్యాచ్‌ల్లో 27 విజయాలు అందించిన అద్భుతమైన ట్రాక్ రికార్డు మార్ష్‌కు అదనపు బలంగా మారింది.
హార్దిక్ అవుట్.. తెలుగు కుర్రాడుకు కెప్టెన్సీ
ముంబై ఇండియన్స్ క్యాంపులో అంతర్గత విభేదాలు ఉన్నాయనేది ఓపెన్ సీక్రెట్. ప్రస్తుత కెప్టెన్ హార్దిక్ పాండ్యా ప్రదర్శన, ప్రవర్తనపై యాజమాన్యం తీవ్ర అసంతృప్తితో ఉంది. ముంబైకి వచ్చిన మూడేళ్లలో హార్దిక్ ఒక్క ట్రోఫీ కూడా గెలవలేకపోయాడు, పైగా గాయాల సమస్యలు ఎక్కువయ్యాయి. వచ్చే సీజన్ కు ముందే హార్దిక్ టీమ్ వీడటం ఖాయంగా కనిపిస్తోంది. సీనియర్లు రోహిత్, సూర్యకుమార్ ఫామ్ కోసం ఇబ్బంది పడుతుండటంతో.. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఐదు సార్లు ఛాంపియన్ అయిన ముంబై జట్టుకు మన తెలుగు కుర్రాడు తిలక్ వర్మను కెప్టెన్ చేయాలని బోర్డు యోచిస్తోంది.
సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్యాట్ కమిన్స్ దూరం
ఎస్‌ఆర్‌హెచ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఐపీఎల్ 2027 సీజన్‌కు అందుబాటులో ఉండకపోవచ్చని స్వయంగా హింట్ ఇచ్చాడు. వచ్చే ఏడాది ఆస్ట్రేలియాకు యాషెస్ సిరీస్, వన్డే వరల్డ్ కప్ వంటి ప్రతిష్టాత్మక టోర్నమెంట్లు ఉండటంతో దేశం కోసమే ఆడతానని కమిన్స్ స్పష్టం చేశాడు. ఒకవేళ కమిన్స్ తప్పుకుంటే, ఆరెంజ్ ఆర్మీ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్‌కు కెప్టెన్సీ పగ్గాలు అప్పజెప్పే అవకాశం గట్టిగా వినిపిస్తోంది.