Suryakumar Yadav: అనుకున్నదే అయింది.. గుడ్ బై చెప్పేసిన సూర్యకుమార్ యాదవ్..?

Suryakumar Yadav: భారత టీ20 కెప్టెన్సీ మారిన తరుణంలో సూర్యకుమార్ యాదవ్ సంచలన నిర్ణయం.

Update: 2026-06-08 02:36 GMT

Suryakumar Yadav: అనుకున్నదే అయింది.. గుడ్ బై చెప్పేసిన సూర్యకుమార్ యాదవ్..?

Mumbai Indians : భారత క్రికెట్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకే పేరు మారుమోగుతోంది.. అదే మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్. టీ20 కెప్టెన్సీ మార్పు ఉత్కంఠ రేపుతున్న తరుణంలో, సూర్య సోషల్ మీడియాలో తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు ఐపీఎల్ వర్గాల్లో, క్రికెట్ అభిమానుల్లో తీవ్ర దుమారం రేపుతోంది. ఇటీవల ఐపీఎల్ 2026 సీజన్ ముగిసిన వెంటనే.. సూర్యకుమార్ యాదవ్ ముంబై ఇండియన్స్ అధికారిక సోషల్ మీడియా ఖాతాలను అన్‌ఫాలో చేశారనే వార్త నెట్టింట దావానలంలా వ్యాపిస్తోంది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టుల ప్రకారం.. సూర్యకుమార్ యాదవ్ తన ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ బయో నుండి ముంబై ఇండియన్స్ అనే పేరును కూడా తొలగించినట్లు ప్రచారం జరుగుతోంది. ముంబై ఫ్రాంచైజీతో సుదీర్ఘ అనుబంధం ఉన్న సూర్య.. అకస్మాత్తుగా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వెనుక పెద్ద వ్యూహమే ఉందంటున్నారు విశ్లేషకులు.

వచ్చే సీజన్ కోసం సూర్యకు వేరే టీమ్ నుండి భారీ ఆఫర్ వచ్చిందని, అందుకే ముంబై ఇండియన్స్‌కు గుడ్ బై చెప్పేందుకే అన్‌ఫాలో చేశాడని కొందరు గట్టిగా వాదిస్తున్నారు. టీ20 కెప్టెన్సీ చేజారడం, జట్టులో చోటు దక్కకపోవడంతో సూర్య తీవ్ర మనస్తాపానికి గురయ్యాడని, అందుకే త్వరలోనే రిటైర్మెంట్ ప్రకటించినా ఆశ్చర్యపోనక్కర్లేదంటూ మరికొందరు ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సూర్యకుమార్ యాదవ్ కెరీర్‌లో గత కొద్దిరోజులుగా ఊహించని పరిణామాలు ఎదురవుతున్నాయి. ఒకవైపు కెప్టెన్‌గా సక్సెస్ అవుతున్నప్పటికీ.. ప్లేయర్‌గా మాత్రం గత కొన్ని సిరీస్‌లలో సూర్య దారుణంగా విఫలమయ్యాడు. ఈ ఫామ్ లేమిని తీవ్రంగా పరిగణించిన బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. సూర్యను కెప్టెన్సీ నుంచి తప్పించడమే కాకుండా.. ఏకంగా భారత టీ20 జట్టులో స్థానం కూడా ఇవ్వకుండా షాకిచ్చింది. సూర్య స్థానంలో శ్రేయస్ అయ్యర్‌ను నూతన టీ20 కెప్టెన్‌గా నియమిస్తూ బోర్డు అధికారిక ప్రకటన చేసింది.

ఒకవైపు దేశవాళీ జట్టులో కెప్టెన్సీ, స్థానం కోల్పోవడం.. మరోవైపు ఐపీఎల్ టీమ్‌ను అన్‌ఫాలో చేయడం చూస్తుంటే సూర్యకుమార్ యాదవ్ కెరీర్ ఒక కీలక మలుపు తిరగబోతోందని స్పష్టమవుతోంది. కష్టకాలంలో అండగా నిలిచిన ముంబై ఇండియన్స్‌తో సూర్య నిజంగానే బంధాన్ని తెంచుకున్నాడా? లేక ఇదంతా కేవలం సోషల్ మీడియా ఊహాగానాలేనా? అన్నది తెలియాలంటే సూర్య స్వయంగా స్పందించాల్సి ఉంది.

Tags:    

Similar News