8 ఫోర్లు, 9 సిక్సర్లతో హెట్మేయర్ విధ్వంసం.. 40 బంతుల్లో ఫాస్టెస్ట్ సెంచరీ..!
Shimron Hetmyer Century: వెస్టిండీస్ విధ్వంసక బ్యాటర్ షిమ్రోన్ హెట్‌మైర్ కరీబియన్ ప్రీమియర్ లీగ్ (CPL)లో సంచలన ఇన్నింగ్స్ ఆడాడు.
8 ఫోర్లు, 9 సిక్సర్లతో హెట్మేయర్ విధ్వంసం.. 40 బంతుల్లో ఫాస్టెస్ట్ సెంచరీ..!
Shimron Hetmyer Century: వెస్టిండీస్ విధ్వంసక బ్యాటర్ షిమ్రోన్ హెట్‌మైర్ కరీబియన్ ప్రీమియర్ లీగ్ (CPL)లో సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గయానా అమెజాన్ వారియర్స్ తరపున కేవలం 43 బంతుల్లో 111 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఇందులో 8 ఫోర్లు, 9 సిక్సర్లు ఉన్నాయి.
40 బంతుల్లోనే సెంచరీ.. రికార్డు సమం..!
హెట్‌మైర్ కేవలం 40 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. దీంతో CPL చరిత్రలో అత్యంత వేగవంతమైన సెంచరీ రికార్డును సమం చేశాడు. ఇంతకుముందు ఆండ్రీ రస్సెల్, టిమ్ సీఫర్ట్ కూడా 40 బంతుల్లోనే శతకాలు బాదారు. దీంతో CPLలో 40 బంతుల సెంచరీ చేసిన మూడో బ్యాటర్‌గా హెట్‌మైర్ నిలిచాడు.
ఎవరెన్ని బంతుల్లో సెంచరీ చేశారంటే..?
ఆండ్రీ రస్సెల్ 40
టిమ్ సీఫర్ట్ 40
షిమ్రోన్ హెట్‌మైర్ 40
షై హోప్ 41
ఆండ్రీ రస్సెల్ 42
16 ఓవర్ల మ్యాచ్‌లో పరుగుల వరద..
వర్షం కారణంగా మ్యాచ్‌ను 16 ఓవర్లకు కుదించారు. గయానా అమెజాన్ వారియర్స్ ఆరంభంలోనే వికెట్లు కోల్పోయినా.. హెట్‌మైర్ గేర్ మార్చడంతో స్కోరు ఒక్కసారిగా దూసుకెళ్లింది. అతడి 111 పరుగుల్లో 86 పరుగులు బౌండరీల ద్వారానే వచ్చాయి. స్ట్రైక్‌రేట్ ఏకంగా 258.14గా నమోదైంది.
హెట్‌మైర్‌కు రొమారియో షెపర్డ్ కూడా తోడవడంతో గయానా 16 ఓవర్లలో 185/5 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం వర్షం అంతరాయం కలిగించడంతో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో గయానా 9 పరుగుల తేడాతో ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌పై విజయం సాధించింది.
ఫామ్‌లోకి వచ్చిన హెట్‌మైర్..
2026 సీజన్‌లో కొంతకాలంగా ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన హెట్‌మైర్‌కు ఈ ఇన్నింగ్స్ భారీ ఊరటనిచ్చింది. CPLలో ఇప్పటివరకు నాలుగు ఇన్నింగ్స్‌ల్లో 186 పరుగులు, 93 సగటు, ఏకంగా 248 స్ట్రైక్‌రేట్‌తో కొనసాగుతున్నాడు.
కీలక గణాంకాలు:
పరుగులు – 111*
బంతులు – 43
సెంచరీ – 40 బంతుల్లో
ఫోర్లు – 8
సిక్సర్లు – 9
స్ట్రైక్‌రేట్ – 258.14