AFG vs IND: అఫ్గాన్‌తో టీ20 సిరీస్‌.. అభిషేక్ ఔట్.. వైభవ్‌‌తో ఓపెనింగ్ చేసేది ఎవరంటే..?

India vs Afghanistan: భారత్‌, అఫ్గానిస్థాన్‌ మధ్య మూడు టీ20 మ్యాచ్‌లు సెప్టెంబర్‌ 13, 15, 17 తేదీల్లో ఢిల్లీలోని అరుణ్‌ జైట్లీ స్టేడియంలో జరగనున్నాయి.

Update: 2026-09-01 14:19 GMT

AFG vs IND: అఫ్గాన్‌తో టీ20 సిరీస్‌.. అభిషేక్ ఔట్.. వైభవ్‌‌తో ఓపెనింగ్ చేసేది ఎవరంటే..?

Vaibhav Sooryavanshi Opening Pair: అఫ్గానిస్థాన్‌తో జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. సెప్టెంబర్‌ 13 నుంచి ఢిల్లీలో ఈ సిరీస్‌ ప్రారంభం కానుంది. అయితే జట్టు ఎంపిక తర్వాత అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న అంశం భారత్‌ ఓపెనింగ్‌ జోడీ ఎవరు? అన్నదే.

ఇటీవల వరుసగా వైభవ్‌ సూర్యవంశీ–అభిషేక్‌ శర్మ ఓపెనింగ్‌ చేసినప్పటికీ.. అఫ్గాన్‌తో సిరీస్‌లో ఈ కాంబినేషన్‌ మారే అవకాశం ఉందంటూ వార్తలు వచ్చాయి.

వైభవ్‌తో సంజూ..?

క్రికెట్‌ అడిక్టర్‌ కథనం ప్రకారం.. వైభవ్‌ సూర్యవంశీతో కలిసి సంజూ శాంసన్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించే అవకాశం ఉందని పేర్కొంది. అభిషేక్‌ శర్మ ఇటీవలి ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఈ మార్పు గురించి చర్చ మొదలైంది.

అయితే ఇది ప్రస్తుతానికి ఒక అంచనా మాత్రమే. బీసీసీఐ ప్రకటించిన జట్టులో అభిషేక్‌ శర్మతో పాటు వైభవ్‌ సూర్యవంశీ, సంజూ శాంసన్ కూడా ఉన్నారు. తుది ప్లేయింగ్‌ ఎలెవన్‌, ఓపెనింగ్‌ కాంబినేషన్‌ను టీమ్‌ మేనేజ్‌మెంట్‌ మ్యాచ్‌ సమయంలోనే నిర్ణయించాల్సి ఉంటుంది.

జింబాబ్వేపై అదరగొట్టిన వైభవ్‌..

15 ఏళ్ల వైభవ్‌ సూర్యవంశీ ఇటీవల జింబాబ్వేతో జరిగిన టీ20 సిరీస్‌లో అదరగొట్టాడు. మూడు మ్యాచ్‌ల్లో 151 పరుగులు, రెండు అర్ధశతకాలతో ఆకట్టుకున్నాడు. దీంతో అఫ్గానిస్థాన్‌తో సిరీస్‌లో అతడిపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

మరోవైపు అభిషేక్‌ శర్మ జింబాబ్వే సిరీస్‌లో పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. అందుకే ఓపెనింగ్‌ స్థానంపై చర్చ మొదలైంది. అయితే అతడిని జట్టు నుంచి తప్పించలేదు. అధికారికంగా ప్రకటించిన 15 మంది సభ్యుల జాబితాలో అభిషేక్‌ కూడా ఉన్నాడు.

సెప్టెంబర్‌ 13 నుంచి సిరీస్‌..

భారత్‌, అఫ్గానిస్థాన్‌ మధ్య మూడు టీ20 మ్యాచ్‌లు సెప్టెంబర్‌ 13, 15, 17 తేదీల్లో ఢిల్లీలోని అరుణ్‌ జైట్లీ స్టేడియంలో జరగనున్నాయి. శ్రేయస్‌ అయ్యర్‌ భారత జట్టుకు కెప్టెన్‌గా, తిలక్‌ వర్మ వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు.

భారత్‌ జట్టు: శ్రేయస్‌ అయ్యర్‌ (కెప్టెన్‌), అభిషేక్‌ శర్మ, వైభవ్‌ సూర్యవంశీ, సంజూ సామ్‌సన్‌, ఇషాన్‌ కిషన్‌, తిలక్‌ వర్మ, శివమ్‌ దూబే, నితీశ్‌ కుమార్‌ రెడ్డి*, అక్షర్‌ పటేల్‌, వాషింగ్టన్‌ సుందర్‌, వరుణ్‌ చక్రవర్తి, రవి బిష్ణోయ్‌, జస్ప్రీత్‌ బుమ్రా, అర్ష్‌దీప్‌ సింగ్‌, హర్షిత్‌ రాణా*.

* ఫిట్‌నెస్‌ క్లియరెన్స్‌కు లోబడి తుది జట్టులో ఎంపిక చేస్తారు.

Tags:    

Similar News