AFG vs IND: హార్దిక్ పాండ్యాకు మరో షాక్.. అఫ్గాన్ సిరీస్‌కు దూరం.. రీఎంట్రీ ఎప్పుడంటే..?
Hardik Pandya Injury: గత కొంతకాలంగా గాయంతో జాతీయ జట్టుకు దూరంగా ఉన్న పాండ్యా.. ఇటీవల పూర్తి స్థాయి సాధనకు తిరిగొచ్చాడు. బౌలింగ్, బ్యాటింగ్‌లో తీవ్రంగా శ్రమిస్తూ ఫిట్‌నెస్ సాధించే దిశగా అడుగులు వేశాడు.
AFG vs IND: హార్దిక్ పాండ్యాకు మరో షాక్.. అఫ్గాన్ సిరీస్‌కు దూరం.. రీఎంట్రీ ఎప్పుడంటే..?
Hardik Pandya Injury: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా పునరాగమనానికి మరోసారి బ్రేక్ పడింది. అఫ్గానిస్థాన్‌తో సెప్టెంబర్ 13 నుంచి జరగనున్న మూడు టీ20ల సిరీస్‌కు అతడు దూరమయ్యాడు. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో సాధన చేస్తున్న సమయంలో కాలికి స్వల్ప ఇబ్బంది తలెత్తడంతో బౌలింగ్ ఆపేయాలని వైద్య బృందం సూచించినట్లు సమాచారం.
బౌలింగ్‌కు తాత్కాలిక విరామం..
గత కొంతకాలంగా గాయంతో జాతీయ జట్టుకు దూరంగా ఉన్న పాండ్యా.. ఇటీవల పూర్తి స్థాయి సాధనకు తిరిగొచ్చాడు. బౌలింగ్, బ్యాటింగ్‌లో తీవ్రంగా శ్రమిస్తూ ఫిట్‌నెస్ సాధించే దిశగా అడుగులు వేశాడు. అయితే తాజాగా కాలిలో తలెత్తిన అసౌకర్యంతో బౌలింగ్‌ను నిలిపివేయాల్సి వచ్చింది. త్వరలోనే తిరిగి బౌలింగ్ ప్రారంభించే అవకాశమున్నప్పటికీ.. అఫ్గాన్ సిరీస్ సమీపంలో ఉండటంతో పూర్తి ఫిట్‌నెస్ సాధించడం కష్టంగా మారింది.
చివరిసారి మార్చిలోనే..
హార్దిక్ పాండ్యా టీమిండియా తరఫున చివరిసారిగా 2026 టీ20 ప్రపంచకప్ ఫైనల్లో మార్చి 8న ఆడాడు. ఆ తర్వాత ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహించినా, గాయం కారణంగా కొన్ని మ్యాచ్‌లకు దూరమయ్యాడు. మే 24న ముంబై తరఫున చివరి మ్యాచ్ ఆడిన తర్వాత పోటీ క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు.
అఫ్గానిస్థాన్‌తో వన్డే సిరీస్, ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌ల్లోనూ అతడు ఆడలేదు. ఇప్పుడు టీ20 సిరీస్ కూడా చేజారడంతో అతడి పునరాగమనం మరింత ఆలస్యం కానుంది.
ఇక వెస్టిండీస్‌తోనే రీఎంట్రీ..?
భారత్ తదుపరి సెప్టెంబర్ 27 నుంచి వెస్టిండీస్‌తో మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది. దీంతో హార్దిక్ పాండ్యా ఆ సిరీస్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లోకి తిరిగి వచ్చే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి. అయితే ఇందుకు ముందుగా అతడు పూర్తి ఫిట్‌నెస్ సాధించి, బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నుంచి క్లియరెన్స్ పొందాల్సి ఉంటుంది.
అఫ్గాన్ సిరీస్‌కు హార్దిక్ స్థానంలో ఎవరు..?
అఫ్గానిస్థాన్‌తో టీ20 సిరీస్‌కు ప్రకటించిన భారత జట్టులో హార్దిక్‌కు చోటు లేదు. నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్ ఆల్‌రౌండింగ్ ఆప్షన్లుగా జట్టులో ఉన్నారు. వీరిద్దరి ఎంపిక కూడా ఫిట్‌నెస్ క్లియరెన్స్‌కు లోబడి ఉంది.
జస్ప్రీత్ బుమ్రా తిరిగి జట్టులోకి రావడం భారత బౌలింగ్ విభాగానికి బలాన్నివ్వనుంది. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా, తిలక్ వర్మ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి కూడా జట్టులో చోటు దక్కింది.
అఫ్గానిస్థాన్ vs భారత్ టీ20 సిరీస్:
తొలి మ్యాచ్ – సెప్టెంబర్ 13
రెండో మ్యాచ్ – సెప్టెంబర్ 15
మూడో మ్యాచ్ – సెప్టెంబర్ 17
వేదిక – న్యూఢిల్లీ.