2 ఓవర్లు.. 6 పరుగులు.. హ్యాట్రిక్‌తోపాటు 5 వికెట్లు.. ప్రత్యర్థులకు పిచ్చెక్కించిన బౌలర్..!

UP T20 2026: ఉత్తరప్రదేశ్ టీ20 లీగ్‌లో నోయిడా కింగ్స్ స్పిన్నర్ శివ సింగ్ అద్భుత ప్రదర్శనతో అదరగొట్టాడు.

Update: 2026-08-31 14:46 GMT

2 ఓవర్లు.. 6 పరుగులు.. హ్యాట్రిక్‌తోపాటు 5 వికెట్లు.. ప్రత్యర్థులకు పిచ్చెక్కించిన బౌలర్..!

UP T20 2026: ఉత్తరప్రదేశ్ టీ20 లీగ్‌లో నోయిడా కింగ్స్ స్పిన్నర్ శివ సింగ్ అద్భుత ప్రదర్శనతో అదరగొట్టాడు. మీరట్ మావెరిక్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం రెండు ఓవర్లలోనే 5 వికెట్లు తీసి 6 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఇందులో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది అతడి హ్యాట్రిక్.

రెండు ఓవర్లలో హ్యాట్రిక్.. అదీ ఎలా..!

కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో ఆగస్టు 31న జరిగిన ఈ మ్యాచ్‌లో శివ సింగ్ మూడో ఓవర్ బౌలింగ్ చేశాడు. ఆ ఓవర్‌లో చివరి రెండు బంతులకు అక్షయ్ దూబే, దివ్యాన్ష్ జోషిలను పెవిలియన్‌కు పంపించాడు.

ఆ తర్వాత మీరట్ ఇన్నింగ్స్ చివరి ఓవర్ వేసిన శివ.. తొలి బంతికే దినేశ్ కుమార్ను బౌల్డ్ చేశాడు. దీంతో అతడి హ్యాట్రిక్ పూర్తయింది. అంటే.. హ్యాట్రిక్‌లోని మూడు వికెట్లు రెండు వేర్వేరు ఓవర్లలో రావడం విశేషం.

2 ఓవర్లు.. 5 వికెట్లు.. 6 పరుగులు..!

హ్యాట్రిక్‌తో ఆగని శివ సింగ్.. అదే ఓవర్‌లో రాహుల్ రాజ్‌పాల్, యువరాజ్ నగర్లను కూడా ఔట్ చేశాడు. మొత్తంగా రెండు ఓవర్లలో 5 వికెట్లు తీసి కేవలం 6 పరుగులు ఇచ్చాడు.

శివ బౌలింగ్ దెబ్బకు మీరట్ మావెరిక్స్ నిర్ణీత ఐదు ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 33 పరుగులు మాత్రమే చేసింది. నోయిడా కింగ్స్ డీఎల్‌ఎస్ పద్ధతిలో ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

కెరీర్‌లో ఊహించని మలుపు..!

శివ సింగ్‌కు ఈ ప్రదర్శన మరింత ప్రత్యేకం. 2022 విజయ్ హజారే ట్రోఫీలో మహారాష్ట్ర బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ అతడి ఒక ఓవర్‌లో ఏకంగా 7 సిక్సర్లు బాదాడు. ఆ ఓవర్‌లో శివ 43 పరుగులు సమర్పించుకున్నాడు.

అలాంటి ఎదురుదెబ్బ తర్వాత ఇప్పుడు రెండు ఓవర్లలో ఐదు వికెట్లు, హ్యాట్రిక్‌తో అదరగొట్టడం అతడి పట్టుదలకు నిదర్శనంగా నిలిచింది.

ప్లేఆఫ్స్‌కు నోయిడా కింగ్స్..

మీరట్‌పై విజయంతో నోయిడా కింగ్స్ యూపీ టీ20 2026 ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. పది మ్యాచ్‌ల్లో ఐదు విజయాలు, ఐదు పరాజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. మరోవైపు ఈ సీజన్‌లో ఇప్పటివరకు అజేయంగా ఉన్న మీరట్ మావెరిక్స్‌కు ఇదే తొలి ఓటమి.

Tags:    

Similar News