IPL 2026: కోల్‌కతా-పంజాబ్ మ్యాచ్ రద్దు..అగ్రస్థానానికి పంజాబ్

IPL 2026: ఐపీఎల్ లో సోమవారం కోల్‌కతా-పంజాబ్ తలపడ్డాయి. అయితే కొద్దిసేపటికే వర్షం మ్యాచ్ కు అంతరాయం కలిగించింది. వర్షం కారణంగా మ్యాచ్ రద్దు చేశారు.

Update: 2026-04-06 17:58 GMT

IPL 2026

IPL 2026: కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) - పంజాబ్ కింగ్స్ (PBKS) మధ్య జరగాల్సిన ఐపీఎల్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ప్రస్తుత సీజన్‌లో వర్షం కారణంగా రద్దయిన మొదటి మ్యాచ్ ఇదే. సోమవారం సాయంత్రం నుంచి కోల్‌కతాలో అడపాదడపా తేలికపాటి వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందే అనుమానాలు ఉన్నాయి. అయితే, మ్యాచ్ ప్రారంభ సమయానికి వాతావరణం బావుంది. దీంతో మ్యాచ్ మొదలైంది.

కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో, ఆతిథ్య జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. సాయంత్రం 7:46 గంటలకు వర్షం కురిసే సమయానికి, ఆ జట్టు 3.4 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 25 పరుగులు చేసింది. కెప్టెన్ అజింక్య రహానే 8 పరుగులకు, అంక్రిష్ రఘువంశీ 7 పరుగులకు అవుటయ్యారు. రెండవ ఓవర్‌లో, జేవియర్ బార్ట్‌లెట్, కామెరాన్ గ్రీన్ (4 పరుగులు) ఫిన్ అలెన్ (6 పరుగులు)లను అవుట్ చేశాడు. ఈ దశలో వర్షం కారణంగా ఆట నిలిచిపోయింది. ఆ తరువాత కొంతసేపటికి వర్షం ఆగిపోయింది. కానీ గ్రౌండ్ తడిగా ఉండడంతో దానిని ఆరబెట్టే ప్రయత్నాలు చేశారు. అయినా మ్యాచ్‌ను తిరిగి ప్రారంభించేందుకు వీలు లేకుండా పోయింది. ఒకదశలో కేవలం ఐదు ఓవర్లు మాత్రమే ఆడించే అవకాశాన్ని కూడా పరిశీలించారు. కానీ, అది కూడా జరగలేదు. గ్రౌండ్ చిత్తడిగా ఉండడంతో మ్యాచ్ కొనసాగించడం కష్టమని తేలిపోయింది. దాంతో రాత్రి సుమారు 11 గంటలకు మ్యాచ్‌ను రద్దు చేయాలని నిర్ణయించారు.

పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి పంజాబ్

మ్యాచ్ డ్రాగా ముగియడంతో, పంజాబ్, కోల్‌కతా చెరో పాయింట్ పొందాయి. ఈ ఒక్క పాయింట్ సహాయంతో పంజాబ్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకోగా, కోల్‌కతా 8వ స్థానంలో నిలిచింది.

రెండు టీమ్స్ ప్లేయర్స్: 

కోల్‌కతా నైట్ రైడర్స్: ఫిన్ అలెన్, అజింక్యా రహానే (కెప్టెన్), కామెరాన్ గ్రీన్, అంగ్క్రిష్ రఘువంశీ (వికెట్ కీపర్), రోవ్‌మన్ పావెల్, రింకూ సింగ్, రమణదీప్ సింగ్, అనుకుల్ రాయ్, నవదీప్ సైనీ, వైభవ్ అరోరా, కార్తీక్ త్యాగి.

ఇంపాక్ట్ ఎంపికలు: మనీష్ పాండే, తేజస్వి సింగ్, రాహుల్ త్రిపాఠి, సౌరభ్ దూబే, బ్లెస్సింగ్ ముజారబానీ.

పంజాబ్ కింగ్స్: ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (WK), కూపర్ కొన్నోలీ, శ్రేయాస్ అయ్యర్ (c), నెహాల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, మార్కో జాన్సెన్, జేవియర్ బార్ట్‌లెట్, విజయ్‌కుమార్ వైషాక్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్.

ఇంపాక్ట్ ఎంపికలు: ప్రియాంష్ ఆర్య, సూర్యాంశ్ షెడ్గే, విష్ణు వినోద్, ప్రవీణ్ దూబే, హర్‌ప్రీత్ బ్రార్.

Tags:    

Similar News