KKR vs PBKS: టాస్ గెలిచిన కోల్‌కతా.. స్టార్స్ అవుట్, తుది జట్లు ఇవే!

KKR vs PBKS: కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగనున్న KKR vs PBKS మ్యాచ్‌లో టాస్ గెలిచిన కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానే బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

Update: 2026-04-06 14:35 GMT

KKR vs PBKS: టాస్ గెలిచిన కోల్‌కతా.. ఇద్దరు స్టార్స్ అవుట్, తుది జట్లు ఇవే!

KKR vs PBKS: ఐపీఎల్ 2026లో భాగంగా కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్), పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) మధ్య కీలక పోరు మరికొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానే బ్యాటింగ్ ఎంచుకున్నాడు. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉందని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. కేకేఆర్ జట్టులో రెండు కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. గత మ్యాచ్‌లో గాయపడిన మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. అలాగే మరో మిస్టరీ స్పిన్నర్ సునీల్ నరైన్ అనారోగ్యం కారణంగా తుది జట్టులో లేడు. వీరి స్థానంలో రోవ్మన్ పావెల్, నవదీప్ సైనీ జట్టులోకి వచ్చారు.

మరోవైపు పంజాబ్ కింగ్స్ మాత్రం ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతోంది. పంజాబ్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ మాట్లాడుతూ.. టాస్ గురించి పెద్దగా ఆలోచించలేదని, తాము బౌలింగ్ కూడా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపాడు. కోచ్ రికీ పాంటింగ్‌తో పని చేయడం ఎంతో సంతోషంగా ఉందని, అతని అనుభవం జట్టుకు ఎంతో ఉపయోగపడుతోందని చెప్పాడు. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు బలంగా కనిపిస్తున్నాయి. కేకేఆర్ వరుస పరాజయాలకు చెక్ పెట్టేందుకు ఈ మ్యాచ్‌లో గెలవాల్సి ఉంది. పంజాబ్ కింగ్స్ తమ విజయ పరంపరను కొనసాగించాలనే లక్ష్యంతో ఉంది. మరి ఈ మ్యాచ్‌లో ఎవరు ఆధిపత్యం చెలాయిస్తారో చూడాలి.

తుది జట్లు:

కోల్‌కతా: ఫిన్ అలెన్, అజింక్య రహానే (కెప్టెన్), కెమెరాన్ గ్రీన్, అంగ్రిష్ రఘువంశీ (వికెట్ కీపర్), రోవ్మన్ పావెల్, రింకు సింగ్, రమన్‌దీప్ సింగ్, అనుకుల్ రాయ్, నవదీప్ సైనీ, వైభవ్ అరోరా, కార్తిక్ త్యాగి.

పంజాబ్: ప్రభ్‌సిమ్రన్ సింగ్ (వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), కూపర్ కానోలీ, నేహల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, మార్కో జాన్సెన్, జేవియర్ బార్ట్‌లెట్, విజయ్‌కుమార్ వైశాఖ్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చహల్.

Tags:    

Similar News