Konaseema: మలికిపురంలో విషాదం చేపల వేటకు వెళ్లి డ్రైన్‌లో పడి వ్యక్తి మృతి!

Konaseema: కోనసీమ జిల్లా మలికిపురం మండలం గూడపల్లి పల్లిపాలెంలో విషాదం. చేపల వేటకు వెళ్లి డ్రైన్‌లో పడి వ్యక్తి మృతి.

Update: 2026-06-16 05:38 GMT

Konaseema: మలికిపురంలో విషాదం చేపల వేటకు వెళ్లి డ్రైన్‌లో పడి వ్యక్తి మృతి!

డాక్టర్. బీఆర్ .అంబేడ్కర్ కోనసీమ జిల్లా: మలికిపురం మండలం గూడపల్లి పల్లిపాలెంకు చెందిన కొపనాతి నాగవర్మ (50) చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు కూనవరం డ్రైన్‌లో పడి మృతి చెందినట్లు ఎస్ఐ సురేశ్ తెలిపారు.

వివరాల ప్రకారం, నాగవర్మ చేపల వేట కోసం వెళ్లిన సమయంలో ప్రమాదవశాత్తు డ్రైన్‌లో పడిపోయారు. గాలింపు చర్యల అనంతరం సోమవారం సాయంత్రం ఆయన మృతదేహం లభ్యమైంది.

మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ తెలిపారు.

కాగా, నాగవర్మకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఆయన ఆకస్మిక మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

Tags:    

Similar News