Rajolu: స్కూల్ బస్సు సిబ్బంది నిర్లక్ష్యం..మూడో తరగతి బాలుడికి తీవ్ర గాయాలు!

Rajolu: రాజోలు మండలం పొదలాడలో స్కూల్ బస్సు సిబ్బంది నిర్లక్ష్యం. బస్సు దిగి రోడ్డు దాటుతుండగా మూడో తరగతి విద్యార్థికి తీవ్ర గాయాలు.

Update: 2026-06-16 05:48 GMT

Rajolu: స్కూల్ బస్సు సిబ్బంది నిర్లక్ష్యం..మూడో తరగతి బాలుడికి తీవ్ర గాయాలు!

రాజోలు : డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం పోదలాడ గ్రామంలో స్కూల్ బస్సు సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఓ మూడో తరగతి విద్యార్థి తీవ్రంగా గాయపడిన ఘటన చోటుచేసుకుంది.

రాజోలు మండలం పొదలాడ గ్రామానికి చెందిన గుబ్బల తన్వీర్ నారాయణ (7) అనే బాలుడు గెద్దాడ లోని ఎడ్యుకేర్ పాఠశాలలో మూడో తరగతి చదువుతున్నాడు. సోమవారం పొదలాడ లోని బాలుడు ఇంటి సమీపంలో పాఠశాల బస్సు నుంచి దిగిన అనంతరం రోడ్డు దాటేందుకు ప్రయత్నించగా, అదే సమయంలో అటుగా వస్తున్న బుల్లెట్ (మోటార్‌ సైకిల్) ఢీకొట్టింది. ప్రమాదంలో బాలుడు కాలు విరగడంతో పాటు తలకు కూడా గాయాలయ్యాయి.

స్థానికుల కథనం ప్రకారం, బస్సులో క్లీనర్ లేకపోవడం వల్ల విద్యార్థులు సురక్షితంగా దిగేలా పర్యవేక్షణ జరగలేదని, ఇదే ప్రమాదానికి ప్రధాన కారణమని ఆరోపిస్తున్నారు. గాయపడిన బాలుడిని వెంటనే అమలాపురం లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విద్యార్దుల భద్రత విషయంలో సంబంధిత అధికారులు, పాఠశాల యాజమాన్యాలు వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

ఈ ఘటనపై వైఎస్సార్సీపీ రాష్ట్ర విద్యార్థి విభాగం అధికార ప్రతినిధి తాడి సహదేవ్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.

Tags:    

Similar News