Razole: రాజోలులో జూన్ 20న డాక్టర్ గుఱ్ఱం ధర్మోజీరావు సంస్మరణ సభ!
Razole: జోలులో దళిత చైతన్య వేదిక ఆధ్వర్యంలో జూన్ 20న నిర్వహించనున్న డాక్టర్ గుఱ్ఱం ధర్మోజీరావు సంస్మరణ సభ కరపత్రాలను దళిత నాయకులు ఆవిష్కరించారు.
Razole: రాజోలులో జూన్ 20న డాక్టర్ గుఱ్ఱం ధర్మోజీరావు సంస్మరణ సభ!
రాజోలు: దళిత చైతన్య వేదిక ఆధ్వర్యంలో జూన్ 20న రాజోలు అంబేడ్కర్ సామాజిక భవనంలో నిర్వహించనున్న స్వర్గీయ డాక్టర్ గుఱ్ఱం ధర్మోజీరావు సంస్మరణ సభ కరపత్రాలను సోమవారం దళిత నాయకులు ఆవిష్కరించారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం సోంపల్లి గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ, ఈ సంస్మరణ సభకు తెలుగు విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ డాక్టర్ చిలుకోటి కూర్మయ్య, డాక్టర్ బండి సత్యనారాయణ, తెలుగు భాషాభివృద్ధి సమితి అధ్యక్షుడు గూటం స్వామి, ప్రముఖ దళిత సాహితీవేత్త తంగిరాల సోని ముఖ్య అతిథులుగా హాజరవుతారని తెలిపారు.
ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 30 మంది కవులతో దళితులు ఎదుర్కొంటున్న సమస్యలపై కవి సమ్మేళనం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అలాగే ప్రముఖ పద్యకవి గొలకోటి శ్రీనివాస్‌కు, ప్రముఖ వచనకవి నేలపూరి రత్నజీకి స్వర్గీయ డాక్టర్ గుఱ్ఱం ధర్మోజీరావు స్మారక అవార్డులతో పాటు నగదు పారితోషికాన్ని అందజేయనున్నట్లు తెలిపారు.
ధర్మోజీరావు సంస్మరణ సభతో పాటు కవి సమ్మేళనంలో ప్రజలు, సాహిత్యాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని దళిత నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సంక్షేమ సంఘ నియోజకవర్గ అధ్యక్షుడు పొలమూరి శ్యాంబాబు, వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి తెన్నేటి కిషోర్, వేదిక వ్యవస్థాపకుడు బత్తుల మురళీకృష్ణ, జిల్లా అధ్యక్షుడు లిఖితపూడి బుజ్జి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిలకపాటి శ్రీధర్, మండల అధ్యక్షుడు మందపాటి మధు, ఎస్సీ సంక్షేమ సంఘ నాయకులు నల్లి శివకుమార్, గెడ్డం ఫిలిప్‌రాజు, పిడీఎం రాష్ట్ర అధ్యక్షుడు దీపాటి శివప్రసాద్, గోగి మోహన్, మెడబల శ్యాంశేఖర్, గెడ్డం చిన్న, కంకిపాటి అరవింద్ తదితరులు పాల్గొన్నారు.