Amalapuram: భూ సమస్యల పరిష్కారంలో పారదర్శకతే ముఖ్యం.. కలెక్టర్ మహేష్

Amalapuram: డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో భూ సమస్యలు, రీ-సర్వే ప్రక్రియపై కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.

Update: 2026-06-16 14:18 GMT

Amalapuram: భూ సమస్యల పరిష్కారంలో పారదర్శకతే ముఖ్యం.. కలెక్టర్ మహేష్

అమలాపురం: భూమి వ్యవహారాలు, రీ-సర్వే, రెవెన్యూ అంశాలకు సంబంధించిన అర్జీలను పీజీఆర్‌ఎస్‌లో పారదర్శకంగా పరిష్కరించాలని డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు.

మంగళవారం రాష్ట్ర సచివాలయం నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న అనంతరం కలెక్టర్ రెవెన్యూ, సర్వే అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో రీ-సర్వే ప్రక్రియను వేగవంతం చేసి రైతులకు కొత్త పట్టాదార్ పాస్‌పుస్తకాలు అందజేయాలని సూచించారు.

ఎల్‌నినో ప్రభావంతో సంభవించే వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని సహజ వ్యవసాయం, బహుళ పంటల సాగు, చెట్ల పెంపకం, నీటి సంరక్షణ వంటి చర్యలను ప్రోత్సహించాలని అధికారులకు ఆదేశించారు. రైతులకు అవసరమైన సూచనలు అందిస్తూ నీటి వనరుల సమర్థ వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు.

ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ వైఖోం నైదియా దేవి, డీఆర్వో వి. సుబ్బారావు, ఆర్డీవోలు, రెవెన్యూ, వ్యవసాయ, అటవీ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Tags:    

Similar News