Malkipuram: మలికిపురం మండలం తూర్పుపాలెం యువకుని అద్భుత ప్రతిభ

Malkipuram: అడబాల మహేష్ బాబు అనే యువకుడు పాత ద్విచక్ర వాహన విడిభాగాలతో 'మినీ వారాహి'ని రూపొందించారు.

Update: 2026-06-16 14:24 GMT

Malkipuram: మలికిపురం మండలం తూర్పుపాలెం యువకుని అద్భుత ప్రతిభ

Malkipuram: డాక్టర్.బీఆర్ .అంబేద్కర్ కోనసీమ జిల్లా, మలికిపురం మండలం తూర్పుపాలెం గ్రామానికి చెందిన యువకుడు అడబాల మహేష్ బాబు తన సృజనాత్మకతతో అందరినీ ఆకట్టుకుంటున్నాడు.పాత ద్విచక్ర వాహనాలకు చెందిన పలు వస్తువులను ఉపయోగించి ప్రత్యేకంగా "మినీ వారాహి" వాహనాన్ని రూపొందించాడు.

సాధారణంగా ద్విచక్ర వాహనాల్లో ఉపయోగించే ఇంజిన్‌ను ఆధారంగా తీసుకుని, తక్కువ ఖర్చుతో ఎక్కువ మైలేజ్ అందించే విధంగా ఈ నాలుగు చక్రాల వాహనాన్ని తయారు చేశాడు. ఈ మినీ వారాహి వాహనం లీటర్ పెట్రోల్‌కు సుమారు 60 కిలోమీటర్ల మేర ప్రయాణించేలా అమరికలు చేసినట్లు యువకుడు తెలిపాడు.

స్థానికంగా లభించే పాత బైక్ ల విడిభాగాలతోనే సుమారు 5 నెలలు కష్టపడి వాహనాన్ని రూపొందించడం విశేషం. ఆకర్షణీయమైన డిజైన్‌తో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద ఉన్న వీర అభిమానాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ వాహనాన్ని తయారు చేసినట్లు పేర్కొన్నాడు.

యువకుడి ప్రతిభను చూసిన గ్రామస్తులు, స్థానిక ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రభుత్వ సంస్థలు, సాంకేతిక నిపుణులు ఇలాంటి యువ ప్రతిభను ప్రోత్సహిస్తే మరిన్ని వినూత్న ఆవిష్కరణలు వెలుగులోకి వస్తాయని అభిప్రాయపడుతున్నారు.

ఈ మినీ వారాహి ప్రస్తుతం స్థానికంగా ఆసక్తికర చర్చకు దారి తీస్తూ, యువతలో సృజనాత్మక ఆలోచనలకు ప్రేరణగా నిలుస్తోంది.

Tags:    

Similar News