Markapuram: వెలిగొండ టన్నెల్ పనులను స్వయంగా పరిశీలించిన మంత్రి నిమ్మల!

Markapuram: దోర్నాల మండలం కొత్తూరు సమీపంలో వెలిగొండ ప్రాజెక్టు టన్నెల్ పనులను పరిశీలించిన జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ప్రజాప్రతినిధులు.

Update: 2026-08-13 18:11 GMT

Markapuram: వెలిగొండ టన్నెల్ పనులను స్వయంగా పరిశీలించిన మంత్రి నిమ్మల!

మార్కాపురం: దోర్నాల మండలం కొత్తూరు సమీపంలోని పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు టన్నల్ వద్ద జరుగుతున్న పనుల పురోగతిని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు.

ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడుతో పాటు ఎమ్మెల్యేలు ఉగ్ర నరసింహారెడ్డి, కందుల నారాయణరెడ్డి, ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్ బాబు టన్నల్‌లోకి వెళ్లి పనుల పురోగతిని పరిశీలించారు.

టన్నల్ బోరింగ్ మిషన్ తొలగింపు పనులతో పాటు టన్నల్‌లో కొనసాగుతున్న లైనింగ్ పనులను మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. పనుల ప్రస్తుత స్థితిగతులు, ఇప్పటివరకు పూర్తయిన పనులు, మిగిలిన పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

వెలిగొండ ప్రాజెక్టు పనులను వేగవంతం చేసి నిర్ణీత లక్ష్యాల మేరకు పూర్తి చేసేందుకు తీసుకుంటున్న చర్యలను అధికారులతో మంత్రి సమీక్షించారు. ప్రాజెక్టు పనుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ నాణ్యతా ప్రమాణాలకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచించారు.

Tags:    

Similar News