Markapur: వెలిగొండ ప్రాజెక్ట్ పనులపై మంత్రుల సమీక్ష

Markapur: మార్కాపురంలో వెలిగొండ ప్రాజెక్ట్ పనులు, ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీపై మంత్రులు నిమ్మల రామానాయుడు, ఆనం రామనారాయణరెడ్డి సమీక్ష. వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశం.

Update: 2026-08-13 12:12 GMT

Markapur: వెలిగొండ ప్రాజెక్ట్ పనులపై మంత్రుల సమీక్ష

మార్కాపూర్: మార్కాపురం జిల్లా కలెక్టరేట్‌లో పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ పనులు, పునరావాసం–పునరావాస ప్యాకేజీ (ఆర్‌అండ్‌ఆర్) పురోగతిపై మంత్రులు నిమ్మల రామానాయుడు, ఆనం రామనారాయణరెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు.

వెలిగొండ ప్రాజెక్ట్ పనుల పురోగతి, ముంపు గ్రామాల ప్రజలకు అందుతున్న ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీలు, పునరావాస కాలనీల్లో మౌలిక వసతుల కల్పన తదితర అంశాలపై మంత్రులు అధికారులతో సమగ్రంగా సమీక్షించారు.

పెండింగ్‌లో ఉన్న పనులను వేగవంతం చేసి, అర్హులైన నిర్వాసితులకు ప్రభుత్వం అందించాల్సిన ప్రయోజనాలను త్వరితగతిన అందించాలని అధికారులకు సూచించారు.

ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు కందుల నారాయణరెడ్డి, కాకర్ల సురేష్, ఉగ్ర నరసింహారెడ్డి, అశోక్‌రెడ్డి, యర్రగొండపాలెం టీడీపీ ఇన్‌చార్జి ఎరిక్షన్‌బాబు, జిల్లా కలెక్టర్ ఎం. విజయసునీత, జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసులు, ఎస్పీ హర్షవర్ధన్ రాజు, ఓఎస్డీ నవజ్యోతి మిశ్రా, ఇరిగేషన్ అడ్వైజర్ ఎం. వెంకటేశ్వరరావు, వెలిగొండ ప్రాజెక్ట్ సీఈ రమేష్‌తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Tags:    

Similar News