Podili: పొదిలిలో ఘనంగా భారీ త్రివర్ణ పతాక దేశభక్తి ర్యాలీ
Podili: పొదిలి పట్టణంలో 100 మీటర్ల భారీ త్రివర్ణ పతాకంతో దేశభక్తి ర్యాలీ. బెల్లంకొండ విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు, నాయకులు.
Podili: పొదిలిలో ఘనంగా భారీ త్రివర్ణ పతాక దేశభక్తి ర్యాలీ
పొదిలి: అమృతోత్సవాల్లో భాగంగా పొదిలి పట్టణంలో 100 మీటర్ల భారీ త్రివర్ణ పతాకంతో దేశభక్తి ర్యాలీ ఘనంగా నిర్వహించారు. బెల్లంకొండ విద్యాసంస్థల సీఈఓ బెల్లంకొండ విజయలక్ష్మి ఆధ్వర్యంలో మండల పరిషత్ కార్యాలయం వద్ద నుంచి చిన్న బస్టాండ్ సెంటర్ వరకు నిర్వహించిన ఈ ర్యాలీ దేశభక్తి నినాదాలతో మార్మోగింది.
విద్యార్థులు చేతుల్లో జాతీయ జెండాలు పట్టుకుని ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొన్నారు. వీరిశెట్టి విద్యాసంస్థలు, బెల్లంకొండ విద్యాసంస్థల ఫార్మసీ, డిగ్రీ విద్యార్థులు, సాయి పబ్లిక్ స్కూల్ విద్యార్థులు, ఏబీవీపీ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బెల్లంకొండ విజయలక్ష్మి మాట్లాడుతూ.. “భారతదేశం శరీరమైతే.. భారతదేశ సంస్కృతి ఆత్మ వంటిది” అని అన్నారు. దేశ సంస్కృతి ఎంతో గొప్పదని, యువత దేశ సమగ్రత, ప్రజాస్వామ్య పరిరక్షణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఏబీవీపీ నాయకులు వయ్యావుల నాగచరణ్, మాలేపాటి నాగచరణ్ మాట్లాడుతూ దేశ రక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని, దేశభక్తి భావాన్ని పెంపొందించుకోవాలని అన్నారు.
BITS విద్యాసంస్థల అధినేత డా. బెల్లంకొండ శ్రీనివాసరావు మాట్లాడుతూ భిన్న కులాలు, మతాలు, జాతులు, సంస్కృతులతో కూడిన భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అని అన్నారు. దేశానికి క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు అందరూ ఒక్కటిగా నిలవాలని పిలుపునిచ్చారు.
ర్యాలీలో వీరిశెట్టి విద్యాసంస్థల అధినేత మద్దుల శ్రీనివాసులు, బీజేపీ మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు సయ్యద్ ఖాదర్ భాషా, సీనియర్ నాయకులు, బీజేపీ మండల అధ్యక్షులు దోర్నాల రమణారెడ్డి, మండ్ల శివప్రసాద్, చిట్టెంశెట్టి శ్రీనివాసులు, పువ్వాడ నారాయణ, విద్యాసంస్థల సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.