Markapuram: పెద్ద దోర్నాల ప్రభుత్వ ఆసుపత్రిలో ‘తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్’ సేవలు!
Markapuram: మార్కాపురం జిల్లా పెద్ద దోర్నాల ప్రభుత్వ వైద్యశాలలో 'తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్' వాహన సేవలను వైద్యాధికారిణి నాగమహేశ్వరి ప్రారంభించారు.
Markapuram: పెద్ద దోర్నాల ప్రభుత్వ ఆసుపత్రిలో ‘తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్’ సేవలు!
మార్కాపురం: తల్లి బిడ్డల క్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహన సేవలను పెద్ద దోర్నాల ప్రభుత్వ వైద్యశాలలో ప్రారంభించారు. ప్రభుత్వ వైద్యురాలు నాగమహేశ్వరి రిబ్బన్ కట్ చేసి వాహనాన్ని లాంఛనంగా ప్రారంభించారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం అయిన ప్రతి తల్లి, బిడ్డను క్షేమంగా వారి స్వస్థలానికి చేర్చేందుకు ఈ వాహన సేవలు ఎంతగానో ఉపయోగపడతాయని వైద్యురాలు నాగమహేశ్వరి తెలిపారు. ప్రసవం అనంతరం తల్లి, బిడ్డలు సురక్షితంగా ఇంటికి చేరుకునేలా ప్రభుత్వం ఈ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చిందన్నారు.
అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణ సౌకర్యం లేని కుటుంబాలకు ఈ సేవలు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని వైద్యులు తెలిపారు. తల్లి, బిడ్డల ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యతనిస్తూ ఈ వాహనాలను వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ప్రభుత్వ వైద్యులు,వైద్యసంజీవ్, రసూల్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.