Nellore: ఎమ్మెల్యే కాకర్ల సురేష్‌పై టీడీపీ మహిళా నేత సంచలన ఆరోపణలు!
Nellore: ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తనను పోలీసులతో కిడ్నాప్ చేయించారని టీడీపీ మహిళా నేత వెంగమాంబ సంచలన ఆరోపణలు చేశారు.
Nellore: ఎమ్మెల్యే కాకర్ల సురేష్‌పై టీడీపీ మహిళా నేత సంచలన ఆరోపణలు!
వింజమూరు: రాజకీయంగా తనకు అవకాశాలు కల్పిస్తానని ఉదయగిరి టీడీపీ ఎమ్మెల్యే కాకర్ల సురేష్ వంచించాడని, ఈ వ్యవహారంపై గతంలో రచ్చ జరగడంతో తాను రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ తనను వేధింపులకు గురి చేస్తున్నాడని దుత్తలూరు మండలం వడ్డీపాళెంకు చెందిన టీడీపీ మహిళ నేత వెంగమాంబ ఆరోపించారు. బుధవారం సీఎం చంద్రబాబు వింజమూరు పర్యటన నేపథ్యంలో టీడీపీ ముఖ్య కార్యకర్తల సమావేశంలోకి తనను వెళ్లకుం డా పోలీసులతో ఎమ్మెల్యే కిడ్నాప్ చేయించారని తీవ్ర ఆరోపణలు చేశారు. దుత్తలూరు మండలం నర్రవాడ వెంగమాంబ ఆలయ ప్రాంగణంలో బుధవారం రాత్రి ఆమె మీడియాతో మాట్లాడారు. వింజమూరుకు సీఎం వస్తున్నారని తెలిసి, సమాజానికి సేవ చేయాలనే తపన తో తన ఆలోచనలను పం చుకోవాలని బెంగళూరు లో ఉన్న తాను వచ్చాన న్నారు. అయితే.. పోలీ సులు కారు చెక్ చేయాలని తనను కిందకు దించి బలవంతంగా మరో కారులో తన కారు డ్రైవర్ను, తన సోదరుడిని మరో కారులో బలవంతంగా ఎక్కించారని చెప్పారు.
ఆ తర్వాత తమ సెల్ఫోన్లు తీసుకుని సీఎం సభ అయి ఆయన వెళ్లేంత వరకు తమను నిర్బంధించి సాయంత్రం వదిలి పెట్టారని ఆరోపించారు.ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తో సయోధ్య చేసుకోవాలని ఓ మహిళ ఎస్సై తనతో చెప్పడాన్ని చూస్తే.. ఇదంతా ఎమ్మెల్యే కుట్ర అనే విషయం స్పష్టమవుతోందన్నారు.ఎమ్మెల్యే తనతో వ్యవహరించిన వైఖరిని చంద్రబాబుకు చెబుతాననే భయంతోనే తనను కిడ్నాప్ చేయించాడని మండిపడ్డారు.తమను ఇక్కడ కాకుండా విజయవాడలో వదిలిపెట్టే ప్రయత్నం జరిగింద న్నారు. ఎమ్మెల్యే తనను ఇంకా వదలకుండా ఇబ్బం దులు పెడుతున్నాడని వాపోయారు. ఈ విషయాన్ని పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళతానని చెప్పారు.