Nellore: వైభవంగా ధ్వజస్తంభ సంప్రోక్షణ - పాల్గొన్న కోటంరెడ్డి సోదరులు

Nellore: నెల్లూరు శ్రీ రాజరాజేశ్వరి ఆలయ ధ్వజస్తంభానికి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి దాతృత్వంతో బంగారు తాపడం చేయించారు.

Update: 2026-04-02 09:26 GMT

Nellore: వైభవంగా ధ్వజస్తంభ సంప్రోక్షణ - పాల్గొన్న కోటంరెడ్డి సోదరులు

Nellore: నెల్లూరులోని శ్రీ రాజరాజేశ్వరి ఆలయం కొత్త శోభ సంతరించుకుంది.. ఎంపి, ఎమ్మెల్యే వేమిరెడ్డి దంపతుల దాతృత్వంతో, ధ్వజస్తంభానికి బంగారు తాపడం చేయించారు.. ఇవాళ అమ్మవారి ఆలయంలో బంగారు పూతతో కూడిన ధ్వజస్తంభ సంప్రోక్షణ వేద పండితుల మంత్రోచ్ఛారణ నడుమ జరిగింది.. ఈ ధ్వజారోహణను ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి , ఆయన సోదరులు రూరల్ టిడిపి ఇన్చార్జి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి నిర్వహించారు.. ఆలయంలో విశేష పూజలు హోమాలు దేదీప్యమానంగా వెలుగుందుతున్నాయి.. ఈ ధ్వజారోహణ కార్యక్రమానికి వేలాది మంది భక్తులు పెద్దసంఖ్యలో తరలి వచ్చారు.. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు ఆలయ నిర్వహకులు.

నెల్లూరు నగరంలోని ప్రధాన మహిమాన్విత క్షేత్రంగా భాసిల్లుతున్న ఈ ఆలయాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు తమ వంతు సహకారాన్ని అందిస్తామని గతంలోనే చెప్పామని, ప్రస్తుత నెల్లూరు ఎంపీ ప్రభాకర్ రెడ్డి ఆయన సతీమణి కొవ్వూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిలు హామీ ఇచ్చారు.. ఇదే సమయంలో ఆలయ అభివృద్ధికి గ్రామీణ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆయన సోదరుడు రూరల్ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని తెలిపారు.. తాజాగా కోట్లాది రూపాయలు విలువైన బంగారు తాపడాన్ని, తాపడంతో ధ్వజ స్తంభాన్ని తయారుచేసి అమ్మవారికి బహుకరించారమని, ఇవాళ వేదమంత్రాలు, మంగళ వాయిద్యాలు, ఆలయ ధార్మిక ఆచారాల ప్రకారం ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం జరిగిందని చెప్పారు వేమిరెడ్డి దంపతులు.

Tags:    

Similar News