Nellore: నవాబ్‌పేట మార్కెట్‌కు మహర్దశ - మంత్రి నారాయణ మాస్టర్ ప్లాన్!
Nellore: నెల్లూరు నవాబ్‌పేట మార్కెట్ యార్డును మంత్రి నారాయణ సందర్శించి, దానిని అత్యాధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు.
Nellore: నవాబ్‌పేట మార్కెట్‌కు మహర్దశ - మంత్రి నారాయణ మాస్టర్ ప్లాన్!
Nellore: నవాబ్ పేట మార్కెట్ ను అత్యాధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దుతామన్నారు మంత్రి నారాయణ.. నెల్లూరు నగరంలోని నవాబ్ పేట మార్కెట్ యార్డును మంత్రి నారాయణ బుధవారం సందర్శించారు .అక్కడ ఏర్పాటు కాబోతున్న అత్యాధునిక మార్కెట్ కోసం అధికారులు రూపొందించిన ప్లానింగ్‌ను క్షుణ్ణంగా పరిశీలించారు.. పలుమార్పులు ,సూచనలు చేసారు మంత్రి నారాయణ.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..
మార్కెట్ యార్డును అత్యాధునిక సౌకర్యాలతో నగరానికే ఒక మకుటంలా తీర్చిదిద్దుతామన్నామని చెప్పారు. అభివృద్ధి జాతరలో తగ్గేదే లేదంటూ నారాయణ పిలుపునిచ్చారు.. హైదరాబాద్ బెంగళూర్ నగరాలకు దీటుగా అన్ని హంగులతో నగరాన్ని సుందరంగా, తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో నగర మేయర్ దేవరకొండ సుజాత అశోక్, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ 7&9 వ డివిజన్ క్లస్టర్ ఇంచార్జ్ కువ్వారపు బాలాజీ,డివిజన్ పార్టీ అధ్యక్షుడు పెంచలయ్య, జనరల్ సెక్రటరీ శివతేజ, యూనిట్ ఇంచార్జ్‌లు నాగేశ్వరరావు, సురేష్ ,మహిళా నాయకులు మంగమ్మ, సుబ్బలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.