Nellore: సీఎం వింజమూరు పర్యటన సక్సెస్ పోలీసులకు ఎస్పీ అజిత అభినందనలు

Nellore: నెల్లూరు జిల్లా వింజమూరులో సీఎం చంద్రబాబు పర్యటన సందర్భంగా పకడ్బందీ బందోబస్తు నిర్వహించిన పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ డా. అజిత వేజెండ్ల అభినందించారు.

Update: 2026-04-02 07:25 GMT

Nellore: సీఎం వింజమూరు పర్యటన సక్సెస్ పోలీసులకు ఎస్పీ అజిత అభినందనలు

నెల్లూరు జిల్లా: గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నెల్లూరు జిల్లా వింజమూరు మండలంలోని పర్యటన విజయవంతంగా పూర్తైన సందర్భంగా.. జిల్లా ఎస్.పి. డా. అజిత వేజెండ్ల పోలీసు అధికారులు, సిబ్బందిని అభినందించారు.

ముఖ్యమంత్రి పర్యటనను దృష్టిలో ఉంచుకుని జిల్లా పోలీసు శాఖ ముందస్తుగా పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేసి, బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ, వీవీఐపీ రూట్ భద్రత, యాంటీ సబోటేజ్ చెకింగ్, బాంబ్ మరియు డాగ్ స్క్వాడ్ వినియోగం వంటి చర్యలను సమర్థవంతంగా అమలు చేసిందని తెలిపారు..

హెలికాప్టర్ ల్యాండింగ్ నుండి తిరుగు ప్రయాణం వరకు కాన్వాయ్ భద్రతను కట్టుదిట్టంగా నిర్వహించడంతో పాటు, డైనమిక్ షెడ్యూల్ తో నడిచిన ఈ బందోబస్త్ ఎటువంటి అంతరాయం లేకుండా కార్యక్రమం సజావుగా జరిగేలా పోలీసులు సమన్వయంతో పనిచేశారు అని డి-బ్రీఫింగ్ సమయంలో జిల్లా యస్పి తెలిపారు.

ఈ సందర్భంగా ఎస్.పి. అజిత వేజెండ్ల మాట్లాడుతూ..

సౌత్ కోస్టల్ జోన్, గుంటూరు రేంజ్, గుంటూరు IGP శ్రీ సర్వశ్రేష్ఠ త్రిపాఠీ , అమూల్యమైన సూచనలు మేరకు,

ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది చూపిన క్రమశిక్షణ, అంకితభావం ప్రశంసనీయమని తెలిపారు. కఠిన పరిస్థితుల్లోనూ బాధ్యతతో విధులు నిర్వహించి ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నందుకు అభినందనలు తెలియజేశారు.

మొత్తం 840 మంది పోలీసు సిబ్బంది పాల్గొని సమిష్టి కృషితో పర్యటనను విజయవంతం చేయడంపై ఎస్.పి. సంతృప్తి వ్యక్తం చేశారు.

Tags:    

Similar News