Nellore: నెల్లూరు రూరల్ ప్రజల ముంగిటకే పాలన.. ప్రజాదర్బార్‌లో సమస్యల వెల్లువ!
Nellore: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమానికి ప్రజల నుండి విశేష స్పందన లభించింది.
Nellore: నెల్లూరు రూరల్ ప్రజల ముంగిటకే పాలన.. ప్రజాదర్బార్‌లో సమస్యల వెల్లువ!
Nellore: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఏర్పాటు చేసిన "ప్రజాదర్బార్" కార్యక్రమంలో పాల్గొన్నారు టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి..
ఈ సందర్భంగా కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ..
ప్రతి రోజు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో నెల్లూరు రూరల్ ప్రజలకు ఉదయం 7గంటల నుండి రాత్రి 8 గంటల వరకు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్నామని చెప్పారు.
రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు, యువనేత, రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని చెప్పారు.. అందులో భాగంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నిర్విరామంగా ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని చెప్పారు. ప్రజలు తెలియజేసిన సమస్యలను పరిష్కారం దిశగా చేపట్టవలసిన చర్యలు అధికారులతో కలసి ఎప్పటికపుడు సమన్వయం చేస్తున్నాం, పరిష్కారం అయ్యే ప్రతీ సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.
ప్రజాదర్బార్ కార్యక్రమంలో భాగంగా ప్రజల నుండి వచ్చిన వినతులలో ఇప్పటికే 27 కోట్లతో 240 అభివృద్ధి పనులకు ప్రారంభించడం జరిగిందని. భవిష్యత్తులో కూడా ప్రజల వినతులను నిధుల లభ్యతను బట్టి అభివృద్ధి పనులను చేస్తామని హామీ ఇచ్చారు. కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.
పై కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మనుబోలు శ్రీధర్ రెడ్డి, క్లస్టర్ ఇంచార్జ్ లు జలదంకి సుధాకర్, సాబీర్ ఖాన్, కో క్లస్టర్ ఇంచార్జ్ రాపూరు శేఖర్, 23వ డివిజన్ టిడిపి అధ్యక్షుడు మేకల మధు, 28వ డివిజన్ టిడిపి అధ్యక్షుడు చెక్క సాయి సునీల్, టిడిపి నాయకులు గౌస్ , వనజా రెడ్డి, మేఘనాథ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.