Bhagwant Mann: రూ.5 కోట్ల లంచం ఆరోపణలు.. పంజాబ్‌ సీఎం భార్యపై విచారణకు ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆదేశం!

Bhagwant Mann: పంజాబ్ సీఎం భగవంత్ మాన్ భార్య గుర్‌ప్రీత్ కౌర్‌పై వచ్చిన రూ.5 కోట్ల లంచం ఆరోపణలపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ విచారణకు ఆదేశించింది.

Update: 2026-08-22 06:21 GMT

Bhagwant Mann: రూ.5 కోట్ల లంచం ఆరోపణలు.. పంజాబ్‌ సీఎం భార్యపై విచారణకు ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆదేశం!

Bhagwant Mann: పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ భార్య గుర్‌ప్రీత్ కౌర్‌పై వచ్చిన తీవ్ర లంచం ఆరోపణలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) స్పందించింది. ఒక అత్యాచారం కేసును తొక్కిపెట్టేందుకు ఆమె రూ.5 కోట్లు డిమాండ్ చేశారని పంజాబ్-హర్యానా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రంజిత్ సింగ్ చేసిన ఫిర్యాదు ఆధారంగా Times of India కథనం ప్రకారం ఎన్‌హెచ్‌ఆర్‌సీ కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది.

ఈ ఆరోపణలపై తక్షణమే విచారణ జరిపి రెండు వారాల్లోగా సమగ్ర చర్యల నివేదిక సమర్పించాలని పంజాబ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మరియు డీజీపీని ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆదేశించింది. అంతేకాకుండా, ఈ వ్యవహారాన్ని కేంద్ర హోంశాఖ (MHA) దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు కమిషన్ తెలిపింది. నివేదిక అందిన తర్వాత తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకోనున్నట్లు పేర్కొంది.

Tags:    

Similar News