Jaipur: రాజస్థాన్‌లో 'సీజేపీ' బృందంపై దాడి.. విద్యాశాఖ మంత్రికి 48 గంటల గడువు!

Jaipur: రాజస్థాన్‌లో స్కూల్ ఠీక్ కరో ప్రచారంలో భాగంగా ప్రభుత్వ పాఠశాల పరిశీలనకు వెళ్లిన కాక్రోచ్ జనతా పార్టీ శ్రేణులపై దాడి.

Update: 2026-08-22 05:34 GMT

Jaipur: రాజస్థాన్‌లో 'సీజేపీ' బృందంపై దాడి.. విద్యాశాఖ మంత్రికి 48 గంటల గడువు!

Jaipur: కాక్రోచ్ జనతా పార్టీ ప్రారంభించిన స్కూల్ ఠీక్ కరో కార్యక్రమం వివాదాస్పదంగా మారింది.రాజస్థాన్‌లో ప్రభుత్వ పాఠశాల పరిస్థితిని పరిశీలించేందుకు వెళ్లిన కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్తలపై గ్రామస్థులు దాడి చేశారన్న ఆరోపణలు వచ్చాయి.ముందస్తు ప్రణాళికతోనే తమపై జరిగిందని సీజేపీ వర్గాలు ఆరోపించాయి.

రాజస్థాన్‌లో ప్రభుత్వ పాఠశాల పరిస్థితిని పరిశీలించేందుకు వెళ్లిన కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్తలపై గ్రామస్థులు దాడి చేశారన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఈ ఘటనపై సీజేపీ కో-కన్వీనర్ అశుతోష్ రంకా తీవ్రంగా స్పందించారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.అంతేకాదు విద్యాశాఖ మంత్రి మదన్ దిలావర్ రాజీనామా చేయాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. ఇందుకు రాజస్థాన్‌ ప్రభుత్వానికి 48 గంటల గడువు విధించారు.

స్కూల్ ఠీక్ కరో అభిజిత్ దీప్కే నాయకత్వంలోని కాక్రోచ్ జనతా పార్టీ ఇటీవల చేపట్టిన కార్యక్రమం ఇది. ఇటీవల మహారాష్ట్రలోని సంతుక్ పింప్రీ గ్రామం నుంచి ఇందుకు సంబంధించిన ప్రచారాన్ని ఆయన ప్రారంభించారు. కాగా సంతుక్ పింప్రీ అభిజిత్ దీప్కే స్వంత గ్రామం కావడం విశేషం. ప్రభుత్వ పాఠశాలల్లోమౌలిక వసతులు మెరుగుపరచడం ఈ ప్రచారంలోని ప్రధాన అంశం.

స్కూల్ ఠీక్ కరో కార్యక్రమంలో భాగంగా సీజేపీ బృందం రాజస్థాన్‌ వెళ్లింది. రాంపురా-కన్వర్‌పురా గ్రామంలో ప్రభుత్వ పాఠశాల పరిస్థితిని పరిశీలించేందుకు వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగినట్లు రంకా తెలిపారు.అంతేకాదు సదరు పాఠశాల కొన్నేళ్లుగా గేదెల కొట్టంలో కొనసాగుతోందని ఆయన ఆరోపించారు. గతేడాది కూడా తమ బృందం అక్కడికి వెళ్లిందన్నారు. అయితే పరిస్థితిలో ఎలాంటి మార్పు కనిపించలేదని ఆయన చెప్పారు.

కాక్రోచ్ జనతా పార్టీ బృందం అక్కడికి చేరుకునేలోపే బీజేపీతో సంబంధం ఉన్న కొంతమంది వ్యక్తులు అక్కడ ఉన్నారని అశుతోష్ రంకా తెలిపారు. అనంతరం ఒక్కసారిగా దాడి జరిగిందని రంకా ఆరోపించారు. అంతేకాదు తమ వాహనాల అద్దాలు పగలగొట్టారని ఆరోపించారు.

అంతేకాదు మహిళా కార్యకర్తపై దాడి చేశారని కూడా ఆయన ఆరో్పించారు. దాడి కారణంగా సీజేపీ కార్యకర్త చేయి విరిగిందన్నారు.కథ అక్కడితో ఆగలేదు. తమపై రాళ్ల దాడి కూడా జరిగిందని రంకా ఆరోపించారు. దాడికి సంబంధించి పోలీసులకు ముందే సమాచారం ఇచ్చినా వారు ప్రేక్షక పాత్ర పోషించారని రంకా ఆరోపించారు. ముందస్తు ప్రణాళికతోనే దాడి జరిగిందని ఆయన ఆరోపించారు.

ఇదిలా ఉంటే, సీజేపీ బృందం పాఠశాల ప్రాంగణంలోకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో స్థానిక గ్రామస్థులు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుని ఉద్రిక్తత పెరిగింది తెలిసింది.

Tags:    

Similar News