Siddipet: అపరిచిత లింక్‌లు క్లిక్ చేయకండి మిరుదొడ్డి ఎస్ఐ సతీష్ హెచ్చరిక

Siddipet: మిరుదొడ్డిలో సైబర్ నేరాలపై ఎస్ఐ సతీష్ అవగాహన. అపరిచిత లింక్‌లు క్లిక్ చేయవద్దని హెచ్చరిక, సైబర్ మోసాల పట్ల యువత జాగ్రత్తగా ఉండాలని సూచన.

Update: 2026-08-20 06:41 GMT

Siddipet: అపరిచిత లింక్‌లు క్లిక్ చేయకండి మిరుదొడ్డి ఎస్ఐ సతీష్ హెచ్చరిక

Siddipet: రోజురోజుకూ పెరిగిపోతున్న సైబర్ నేరాల పట్ల ప్రజలు, ముఖ్యంగా యువత అత్యంత అప్రమత్తంగా ఉండాలని సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి ఎస్ఐ సతీష్ సూచించారు. ప్రస్తుత రోజుల్లో స్మార్ట్ ఫోన్ వినియోగం విపరీతంగా పెరిగిపోయిందని, దీనినే ఆసరాగా చేసుకుని సైబర్ కేటుగాళ్లు నిత్యం కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

వచ్చే అపరిచిత మెసేజ్లు, లింక్ల పట్ల అవగాహనతో ఉండాలని ఎస్ఐ స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటి అనుమానాస్పద లింక్లపై క్లిక్ చేయకూడదని, అలా చేయడం వల్ల బ్యాంకు ఖాతాల్లోని డబ్బులు క్షణాల్లో మాయమయ్యే ప్రమాదం ఉందన్నారు. ఇప్పటికే చాలామంది యువత సైబర్ నేరగాళ్ల మాయమాటలు నమ్మి, తమ కష్టార్జితాన్ని పోగొట్టుకున్నారని గుర్తుచేశారు.

ప్రజలను చైతన్యపరిచేందుకు పోలీస్ శాఖ తరఫున ఎప్పటికప్పుడు ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.

Tags:    

Similar News