Dubbaka: దుబ్బాక మండలంలో ఘోర ప్రమాదం బావిలో పడి నలుగురు మృతి!

Dubbaka: దుబ్బాక మండలం అప్పనపల్లి వద్ద ఘోర ప్రమాదం. బావిలోకి కారు దూసుకెళ్లి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి, బలవంతపూర్‌లో తీవ్ర విషాదం.

Update: 2026-08-20 02:32 GMT

Dubbaka: దుబ్బాక మండలంలో ఘోర ప్రమాదం బావిలో పడి నలుగురు మృతి!

Dubbaka: దుబ్బాక మండలం అప్పనపల్లి గ్రామ శివారులో బుధవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు జలసమాధి అయ్యారు. బలవంతపూర్ గ్రామానికి చెందిన ధన్ల రాజు తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి సిద్దిపేట నుంచి కారులో స్వగ్రామానికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

రాత్రి 7 గంటలకు సిద్దిపేట నుంచి బయలుదేరిన కుటుంబం అర్ధరాత్రి అయినా ఇంటికి చేరకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సెల్‌ఫోన్ లోకేషన్ ద్వారా ఆచూకీ కోసం గాలించారు. అప్పనపల్లి శివారులో రోడ్డు పక్కనే ఉన్న బావిలోకి కారు దూసుకెళ్లినట్లు గుర్తించారు. కారు బావిలో పడినప్పుడు ఎవరూ గమనించకపోవడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. సహాయక బృందాలతో కలిసి పోలీసులు అర్ధరాత్రి శవాలను బయటకు తీశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు.

ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం చెందడంతో బలవంతపూర్, అప్పనపల్లి గ్రామాల్లో తీవ్ర విషాదం నెలకొంది. స్థానికులు కన్నీరుమున్నీరయ్యారు.

Tags:    

Similar News