Narsapur: నర్సాపూర్‌లో ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు!

Narsapur: మెదక్ జిల్లా నర్సాపూర్‌లో భారత మాజీ ప్రధాని భారతరత్న రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి.

Update: 2026-08-20 10:26 GMT

Narsapur: నర్సాపూర్‌లో ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు!

నర్సాపూర్: మాజీ ప్రధానమంత్రి, భారతరత్న స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా నర్సాపూర్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. పట్టణంలోని గాంధీ విగ్రహం వద్ద రాజీవ్ గాంధీ చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ శ్రీ అవుల రాజిరెడ్డి, మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ ఆంజనేయులు గౌడ్, నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ శ్రీ మాచునూరి లక్ష్మీరాజ్ యాదవ్‌తో పాటు సీనియర్ నాయకుడు పైడి శ్రీధర్ గుప్తా తో పాటు పలువురు కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. రాజీవ్ గాంధీ దేశ ప్రధానమంత్రిగా భారతదేశ అభివృద్ధికి విశేష కృషి చేశారని గుర్తుచేశారు. దేశంలో ఆధునిక సాంకేతికతకు ప్రాధాన్యత కల్పించడంతో పాటు యువతకు మరిన్ని అవకాశాలు కల్పించేందుకు ఆయన తీసుకున్న నిర్ణయాలు దేశ ప్రగతికి బాటలు వేశాయని పేర్కొన్నారు.

యువత సాధికారత, విద్య, సాంకేతిక రంగాల అభివృద్ధి, ఆధునిక భారత నిర్మాణంలో రాజీవ్ గాంధీ అందించిన సేవలు చిరస్మరణీయమని నాయకులు కొనియాడారు. దేశ అభివృద్ధి కోసం ఆయన చూపిన మార్గం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు.

రాజీవ్ గాంధీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు పిలుపునిచ్చారు. అనంతరం రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

Tags:    

Similar News