Markapur: వెలిగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాలపై అధికారులతో సమీక్ష!

Markapur: వెలిగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాల ప్రజలను వీలైనంత త్వరగా పునరావాస ప్రాంతాలకు తరలించాలని జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత అధికారులను ఆదేశించారు.

Update: 2026-08-21 04:04 GMT

Markapur: వెలిగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాలపై అధికారులతో సమీక్ష!

Markapur: వెలిగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాల ప్రజలను వీలైనంత త్వరగా పునరావాస ప్రాంతాలకు తరలించాలని జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వాసితుల తరలింపు, పరిహారం, గ్రీవెన్స్‌లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ప్రభుత్వం ఇప్పటికే రూ.200 కోట్లు విడుదల చేసిందని, మిగిలిన బాధితులకు త్వరలో పరిహారం అందుతుందని తెలిపారు. 18 ఏళ్లు నిండినప్పటికీ పరిహారం అందని వారు, పేర్లలో తప్పులున్న వారి వివరాలను సేకరించి న్యాయం చేయాలని ఆదేశించారు. పునరావాస కాలనీల్లో పెండింగ్‌లో ఉన్న మౌలిక వసతుల పనులను వేగంగా పూర్తి చేయాలని సూచించారు.

సమావేశంలో జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసులు, ఆర్డీఓలు వెంకట శివరామిరెడ్డి, అజయ్ కుమార్ తదితర అధికారులు పాల్గొన్నారు.

Tags:    

Similar News