Markapur: మార్కాపురం పోలీసుల చొరవ: మిస్సైన 4 మొబైల్ ఫోన్లు రికవరీ!
Markapur: పట్టణంలో పోగొట్టుకున్న 4 మొబైల్ ఫోన్లను పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో రికవరీ చేసి యజమానులకు అందజేశారు. పోలీసుల చొరవపై బాధితులు హర్షం వ్యక్తం చేశారు.
Markapur: మార్కాపురం పోలీసుల చొరవ: మిస్సైన 4 మొబైల్ ఫోన్లు రికవరీ!
Markapur: మార్కాపురం లో ప్రజల ఫిర్యాదులపై తక్షణమే స్పందించిన మార్కాపురం పట్టణ పోలీసులు మిస్సైన నాలుగు మొబైల్ ఫోన్లను రికవరీ చేసి, వాటిని సంబంధిత యజమానులకు అప్పగించారు.
మార్కాపురం టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న బాధితులు పోలీసులను ఆశ్రయించగా, పట్టణ ఎస్సై విశ్వనాథరెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి నాలుగు మొబైల్ ఫోన్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
రికవరీ చేసిన మొబైల్ ఫోన్లను ఎస్సై విశ్వనాథరెడ్డి సంబంధిత యజమానులకు అప్పగించారు. ప్రజల ఫిర్యాదులపై వెంటనే స్పందించి మొబైల్ ఫోన్లను రికవరీ చేసిన పోలీస్ సిబ్బందిని ఎస్సై విశ్వనాథరెడ్డి అభినందించారు.