Atmakur: అమానుషం.. 9 ఏళ్ల చిన్నారిని స్తంభానికి కట్టేసి చిత్రహింసలు!
Atmakur: నంద్యాల జిల్లా ఆత్మకూరు సమీపంలోని కొట్టాల చెరువు చెంచుగూడెంలో 9 ఏళ్ల గిరిజన బాలికను స్తంభానికి కట్టేసి చిత్రహింసలకు గురిచేసిన అమానుష ఘటన వెలుగుచూసింది.
Atmakur: అమానుషం.. 9 ఏళ్ల చిన్నారిని స్తంభానికి కట్టేసి చిత్రహింసలు!
ఆత్మకూరు: అభం శుభం తెలియని 9 ఏళ్ల చిన్నారిని బంధించి రెండు గంటల పాటు వేధించి ఆపై ఆ బాలికను దగ్ధం చేసి సమీప నల్లమలలోని వరదరాజ స్వామి ప్రాజెక్టులో పారవేయాలనుకున్న అమానుష సంఘటన నంద్యాల జిల్లా ఆత్మకూరు సమీప నల్లమల కొట్టాల చెరువు చెంచుగూడెంలో చోటు చేసుకుంది. ఈ సంఘటనపై మొదట తనకు ఎలాంటి ఫిర్యాదు రాలేదంటూనే మరోవైపు పోలీసులే బాధ్యత చిన్నారిని ఆత్మకూరు పోలీస్ స్టేషన్ కు తరలించి విచారణ చేస్తున్నట్లు సమాచారం.
నల్లమల అటవీ చెంచుగూడెం కొట్టాల చెరువులో 9 ఏళ్ల పావని నాలుగవ తరగతి చదువుతుంది. ఇదే గూడెంలో ఇంట్లోనే దుకాణం నడుపుతూ వ్యాపారం చేస్తున్న మల్లి నాయక్ అనే వ్యక్తి చిన్నారి పావని స్తంభానికి తాళ్లతో కట్టి బంధించాడు. బయటకి వెళ్ళిన తమ చిన్నారి ఎంతకు ఇంటికి రాకపోవడంతో .. పావని బంధువులు గాలించారు. చివరకు షాపు యజమాని తన ఇంట్లో చిన్నారిని తాళ్లతో బంధించి మూడు గంటల పాటు చిత్రహింసల పాలు చేసినట్లు బాధిత చిన్నారి తన తల్లిదండ్రులతో వాపోయింది.
బంధించడానికి రాజు నాయక్ అనే మరో వ్యక్తి పూర్తిగా సహకరించిన విషయం బయటకొచ్చింది. షాపు యజమానిని నిలదీయడంతో తన షాపులో దొంగతనానికి ప్రయత్నించిందని అందుకే బందించానని యజమాని చెప్పిన సమాధానానికి బాధ్యత బంధువులు ఆగ్రహించారు.
షాప్ యజమాని, బంధువులు కూడా బాధిత చిన్నారి బంధువులపై దాడికి పాల్పడ్డారు. తాను ఎలాంటి దొంగతనం చేయలేదని షాపు ఎదురుగా నిల్చుంనందుకు మల్లి నాయక్ లోపలికి తీసుకువెళ్లి తాళ్లతో స్తంభానికి కట్టివేసి హింసించాడని బాధిత చిన్నారి పావని తల్లిదండ్రులకు రోధిస్తూ చెప్పుకుంది. మల్లి నాయక్, రాజు నాయక్ ఇద్దరు అగరుబత్తీలతో చేతులకు కాల్చారని, తనతో బలవంతంగా సారా తాగించే ప్రయత్నం చేసారని చిన్నారి గూడెంలో బహిరంగంగా వెల్లడించింది. చిన్నారి చెప్పిన మరో విషయంతో పోలీసులే షాకయ్యారు.
చిన్నారిని దగ్ధం చేసి గుట్టుచప్పుడు కాకుండా సమీపంలోని వరదరాజ స్వామి ప్రాజెక్టులో పారవేయాలనే వ్యూహాన్ని చిన్నారి నోటినుంచి విన్న గ్రామస్తులు భయాందోళనకు లోనయ్యారు. రెండేళ్ల క్రితం ముచ్చుమర్రిలో ఓ మైనర్ బాలికపై అత్యాచారం, మూటకట్టి కృష్ణ నదిలో పడవేసిన సంఘటనను కొట్టాల చెరులో చోటుచేసుకున్న అమానుష ఘటన గుర్తుకు తెస్తుందని గ్రామస్తులు ఈ సందర్బంగా అంటున్నారు.
ఇదిలా ఉంటే.. సదరు షాపు యజమాని మల్లి నాయక్, అతని అనుచరుడు రాజు నాయక్ , అతని అనుచరులు గతంలో కూడా మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించడం, కిశోరబాలికలను వేధింపులకు గురిచేసిన సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. తమ కూతురును బంధించి హింసించిన షాపు యజమాని పై ఆత్మకూరు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళుతున్న చిన్నారి బంధువులను షాప్ యజమాని అతని బంధువులు అడ్డుకున్నారు.
ఇంతటి అమానుష కారణానికి వడిగట్టిన షాపు యజమాని మల్లి నాయక్, రాజు నాయక్ పై చర్యలు తీసుకోవాలని బాధితురాలు తల్లిదండ్రులు, కొట్టాల గిరిజనులు , ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
ఈ సంఘటనపై ఆత్మకూరు పోలీసులు బాధిత చిన్నారిని స్టేషన్లో విచారిస్తున్న సందర్భంలో.. బయటకు మాత్రం తనకు అలాంటి ఫిర్యాదు అందలేదని చెబుతూ.. ఈ సంఘటన బట్టబయలు కావటంతో పోలీసులే స్వయంగా రంగంలోకి దిగారని తెలుస్తుంది.