Kurnool: కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలి!
Kurnool: కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని గుత్తి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు నిరసన. రాయలసీమ ప్రజలకు న్యాయం అందుబాటులోకి రావాలని డిమాండ్.
Kurnool: కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలి!
Kurnool: అనంతపురం జిల్లా గుత్తి*లో కర్నూలులో *హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ గుత్తి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు సోమవారం నిరసన చేపట్టారు.
ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ రాయలసీమ ప్రాంత ప్రజలకు న్యాయ సేవలు మరింత అందుబాటులోకి రావాలంటే కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయడం అవసరమని అన్నారు.
దూర ప్రాంతాల నుంచి హైకోర్టుకు వెళ్లాల్సి రావడంతో ప్రజలు, న్యాయవాదులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రయాణ ఖర్చులు, సమయం వృథా అవుతోందని, పేద ప్రజలకు న్యాయం అందడం కష్టంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
రాయలసీమ జిల్లాల ప్రజల సౌకర్యార్థం ప్రభుత్వం వెంటనే స్పందించి కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యను ప్రభుత్వం, న్యాయశాఖ పరిగణనలోకి తీసుకోవాలని కోరారు.నిరసనలో గుత్తి బార్ అసోసియేషన్ సభ్యులు, సీనియర్ న్యాయవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.