Kurnool: మైనర్ డ్రైవింగ్‌పై కర్నూలు ట్రాఫిక్ పోలీసుల ప్రత్యేక తనిఖీలు!

Kurnool: కర్నూలులో మైనర్ డ్రైవింగ్‌పై ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. నిబంధనలు ఉల్లంఘించిన 20 ద్విచక్ర వాహనాలను గుర్తించి జరిమానాలు విధించారు.

Update: 2026-08-21 03:54 GMT

Kurnool: మైనర్ డ్రైవింగ్‌పై కర్నూలు ట్రాఫిక్ పోలీసుల ప్రత్యేక తనిఖీలు!

Kurnool: జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు కర్నూలు ట్రాఫిక్ సీఐ మన్సురుద్దీన్ గారి ఆధ్వర్యంలో కర్నూలు పట్టణంలోని ఆర్ఎస్ రోడ్డు నుండి మౌర్య ఇన్ మధ్యలో ఉన్న చైతన్య కళాశాల సమీపంలో గురువారం మైనర్ డ్రైవింగ్‌ పై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు.

ఈ తనిఖీల్లో ఇంటర్మీడియట్ విద్యార్థులు నడుపుతున్న 20 ద్విచక్ర వాహనాలను గుర్తించి, నిబంధనల ప్రకారం జరిమానాలు విధించారు. వీటిలో కొన్ని అధిక సీసీ సామర్థ్యం కలిగిన వాహనాలు ఉన్నాయి.

మైనర్ విద్యార్థుల తల్లిదండ్రులను పిలిపించి, వారికి ట్రాఫిక్ నిబంధనలు, రహదారి భద్రత, మైనర్లకు వాహనాలు ఇవ్వడం వల్ల కలిగే ప్రమాదాలపై అవగాహన కల్పిస్తూ కౌన్సిలింగ్ నిర్వహించారు. మైనర్లకు వాహనాలు ఇవ్వకుండా తల్లిదండ్రులు బాధ్యత వహించాలని, రహదారి భద్రతా నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని కర్నూలు ట్రాఫిక్ పోలీసులు సూచించారు.

Tags:    

Similar News